బిజినెస్

ఫ్లిప్‌కార్ట్ సిఇఒగా బిన్ని బన్సల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 11: దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ కొత్త సిఇఒగా సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన బిన్ని బన్సల్ నియమితులయ్యారు. తన సహ వ్యవస్థాపకుడు సచిన్ బన్సల్ స్థానంలో బిన్ని బాధ్యతలు చేపడుతుండగా, ఫ్లిప్‌కార్ట్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఇకపై సచిన్ బన్సల్ వ్యవహరించనున్నారు. బిన్ని బన్సల్ ఇప్పటిదాకా సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా పనిచేశారు. సచిన్ బన్సల్, బిన్ని బన్సల్ కలిసి 2007లో ఫ్లిప్‌కార్ట్‌ను స్థాపించారు. కాగా, అమెరికాలో ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపిఒ)కు ఫ్లిప్‌కార్ట్ వెళ్లనున్న క్రమంలోనే ఈ మార్పులు చోటుచేసుకున్నట్లు వినిపిస్తోంది.

సిసిఐ చైర్మన్‌గా దేవేందర్ కుమార్ సిక్రీ
న్యూఢిల్లీ, జనవరి 11: ఫెయర్ ట్రేడ్ రెగ్యులేటరైన కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) నూతన చైర్మన్‌గా దేవేందర్ కుమార్ సిక్రీ సోమవారం ఇక్కడ ప్రమాణం చేశారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ట్విట్టర్‌లో పేర్కొంది. అశోక్ చావ్లా ఈ నెల 7న పదవీ విరమణ పొందడంతో ఆయన స్థానంలో సిక్రీ బాధ్యతల్లోకి వచ్చారు. 2011 జూన్‌లో ధనేంద్ర కుమార్ నుంచి సిసిఐ చైర్మన్ బాధ్యతలను చావ్లా తీసుకోగా, ఈయన మాజీ ఆర్థిక కార్యదర్శి. కాగా, 62 ఏళ్ల సిక్రీ.. గుజరాత్ కేడర్ మాజీ ఐఎఎస్ అధికారి. సిసిఐ చైర్మన్‌గా ఆయన మూడో వ్యక్తి.