బిజినెస్

మరో రెండు సిపిఎస్‌ఇల మూసివేత?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 27: మరో రెండు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు (సిపిఎస్‌ఇ) మూతపడబోతున్నాయి. అందులో ఒకటి హెచ్‌ఎమ్‌టికి చెందినదైతే, మరొకటి టైర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (టిసిఐఎల్). ఇప్పటికే నష్టాల్లో నడుస్తున్న హెచ్‌ఎమ్‌టి బేరింగ్స్, హెచ్‌ఎమ్‌టి వాచెస్, హెచ్‌ఎమ్‌టి చినార్ వాచెస్, తుంగభద్ర స్టీల్ ప్రోడక్ట్స్, హిందుస్థాన్ కేబుల్స్ సంస్థలను మూసివేయాలని ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చేసింది. కేంద్ర కేబినెట్ ఇందుకు ఆమోదం కూడా తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ ఐదింటికితోడు మరో హెచ్‌ఎమ్‌టి సంస్థతోపాటు టిసిఐఎల్‌నూ మూసివేయాలన్నదాన్ని మోదీ సర్కారు పరిశీలిస్తోంది. ఈ మేరకు కేంద్ర మంత్రి అనంత్ గీతే శుక్రవారం ఇక్కడ తెలిపారు. పారిశ్రామిక సంఘం సిఐఐ నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ నష్టాల్లో ఉన్న ఏ ప్రభుత్వరంగ సంస్థలోనూ పెట్టుబడుల ఉపసంహరణకు వెళ్ళబోవడం లేదన్నారు. నిజానికి టిసిఐఎల్‌ను జాయింట్ వెంచర్ ద్వారాగాని, పెట్టుబడుల ఉపసంహరణ ద్వారాగాని తిరిగి పునరుద్ధరించాలని కేంద్రం అనుకుంది. దీనికి కేబినెట్ సైతం అంగీకరించింది. అయితే అలాంటిదేమీ లేదని తాజాగా చెప్పిన గీతే.. మూతపడనున్న ఆ మరో హెచ్‌ఎమ్‌టి సంస్థ ఏదన్నది మాత్రం తెలియపరచలేదు. ఇకపోతే భారత ఉక్కు పరిశ్రమలకు చైనా, కొరియా దేశాల సంస్థల నుంచి మార్కెట్‌లో తీవ్ర పోటీ ఎదురవుతున్న క్రమంలో దేశ ఉక్కు పరిశ్రమలకు దన్నుగా పలు చర్యలను తీసుకోబోతున్నట్లు మంత్రి చెప్పారు. అలాగే జర్మనీ ఆటోరంగ దిగ్గజం ఫోక్స్‌వాగన్ కాలుష్య నిబంధనల ఉల్లంఘన అంశంపై స్పందిస్తూ ఇప్పటికే ప్రభుత్వం ఫోక్స్‌వాగన్‌కు నోటీసులిచ్చినది గుర్తుచేశారు.