బిజినెస్

ఆర్‌కామ్‌కు టెలికాం శాఖ రూ. 5,600 కోట్ల నోటీసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 12: అనిల్ అంబానీ నేతృత్వంలోని టెలికామ్ సంస్థ రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) నుంచి దాదాపు 5,600 కోట్ల రూపాయలను టెలికామ్ శాఖ డిమాండ్ చేస్తోంది. స్పెక్ట్రమ్ సరళీకరణకు పాల్పడ్డారనే దానిపై ఈ మొత్తాన్ని టెలికాం శాఖ కోరుతుండగా, దీనికి సంబంధించి గత నెల డిసెంబర్ 22న ఆర్‌కామ్‌కు నోటీసులు కూడా జారీ అయినట్లు తెలుస్తోంది. ఈ మొత్తాన్ని నెల రోజుల్లోగా చెల్లించాలని నోటీసుల్లో ఆర్‌కామ్‌కు టెలికాం శాఖ స్పష్టం చేసినట్లు సమాచారం. అలాగే వన్ టైమ్ స్పెక్ట్రమ్ చార్జ్ క్రింద సుమారు 1,569 కోట్ల రూపాయల బ్యాంక్ పూచీకత్తునూ సమర్పించాలని సూచించింది. కాగా, మొత్తం 20 సర్కిళ్లలో 800 మెగాహెట్జ్ స్పెక్ట్రమ్ సరళీకరణకు ఆర్‌కామ్ దిగిందని తెలుస్తుండగా, 16 సర్కిళ్లలోనే స్పెక్ట్రమ్ సరళీకరణ జరిగినట్లు నోటీసుల్లో టెలికాం శాఖ పేర్కొంది.
ఆ మిగతా నాలుగు సర్కిళ్లు కేరళ, కర్నాటక, రాజస్థాన్, తమిళనాడు. వీటికి సంబంధించి ఎలాంటి నోటీసులను ఇంకా ఆర్‌కామ్ అందుకోలేదని తెలుస్తోంది. ఇదిలావుంటే ఆయా సర్కిళ్లలో స్పెక్ట్రమ్ సరళీకరణపై టెలికామ్ రెగ్యులేటర్ ట్రాయ్ అభిప్రాయాన్ని కూడా టెలికాం శాఖ తీసుకోవడం గమనార్హం. మరోవైపు దీనిపై స్పందించేందుకు ఆర్‌కామ్ నిరాకరించింది. కాగా, తన అన్న ముఖేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్‌తో స్పెక్ట్రమ్ భాగస్వామ్యానికి సిద్ధమైనట్లు ఇప్పటికే అనిల్ అంబానీ ప్రకటించారు. దీనికి సంబంధించి జరుగుతున్న చర్చలు కూడా తుది దశకు చేరాయని సంస్థ వార్షిక సాధారణ సమావేశంలో అనిల్ స్పష్టం చేశారు. ఈ క్రమంలో టెలికాం శాఖ నోటీసులు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.