బిజినెస్

నష్టాల్లో బిహెచ్‌ఇఎల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భోపాల్, జనవరి 12: కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోగల 32 ప్రభుత్వరంగ సంస్థల్లో 12 సంస్థలు నష్టాల్లో నడుస్తున్నాయి. బిహెచ్‌ఇఎల్‌తోపాటు మరో 11 సంస్థలు ప్రస్తుతం నష్టాల్లోనే ఉన్నాయని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి అనంత్ గీతే తెలిపారు. మంగళవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడిన ఆయన మహారత్న హోదా కలిగిన బిహెచ్‌ఇఎల్ ఒక ఏడాదిలో లాభాల్లోకి రాగలదన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఈ ఏడాది 28,000 కోట్ల రూపాయల ఆర్డర్లను అందుకుందని చెప్పారు. కాగా, గత యుపిఎ ప్రభుత్వ హయాంలో జరిగిన బొగ్గు కుంభకోణమే బిహెచ్‌ఇఎల్ నష్టాల్లోకి జారుకోవడానికి కారణమని ఓ ప్రశ్నకు సమాధానంగా మంత్రి ఆరోపించారు. బొగ్గు కుంభకోణం వెలుగు చూసిన తర్వాత బొగ్గు సరఫరా మందగించిందని, ఇది విద్యుదుత్పత్తిపై ప్రభావం చూపిందని అన్నారు. అది బిహెచ్‌ఇఎల్‌పైనా ప్రతికూల ప్రభావాన్ని ఏర్పరిచిందన్నారు. ఏదిఏమైనప్పటికీ బిహెచ్‌ఇఎల్, మరో 11 సంస్థల పరిస్థితిలో మార్పును తీసుకొస్తామన్నారు.