బిజినెస్

గోదావరిలో ఇసుక డ్రెడ్జింగ్‌కు బ్రేకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జనవరి 12: గోదావరి నదిలో సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజికి ఎగువన ఉన్న ఇసుక మేటలను తొలగించేందుకు ప్రతిపాదించిన డ్రెడ్జింగ్ కార్యక్రమానికి బ్రేకు పడినట్టు తెలుస్తోంది. బ్యారేజి నుండి 3 కిలోమీటర్లు ఎగువ ప్రాంతంలోని బౌస్ట్రింగ్ రైలు వంతెన వరకు సుమారు 7 కిలోమీటర్లు పొడవున గోదావరి నదిలో ఉన్న ఇసుకను డ్రెడ్జింగ్ చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి విదితమే.
పూడిక తొలగింపు కార్యక్రమంలో భాగంగా ఇసుకను డ్రెడ్జింగ్ ద్వారా బయటకు తీసుకువావాలన్నది రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం. గోదావరి నదిలోని కాటన్ బ్యారేజి బేసిన్‌లో ప్రస్తుతం ఉన్న ఇసుక మేటల్లో సుమారు 64 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక ఉంటుందని జలవనరుల శాఖ అధికారులు అంచనా వేశారు. ఈ అంచనాలు ఏడాదిన్నర క్రితానివి. అయతే ఆ తరువాత గోదావరి నదికి వరదలు సంభవించటంతో మరింత ఇసుక బ్యారేజి బేసిన్‌లో చేరి ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కేవలం బ్యారేజి బేసిన్‌లోని మేటలను తొలగిస్తే తాజా పరిణామాల్లో సుమారు కోటి క్యూబిక్ మీటర్లు ఇసుక లభించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నోటిఫికేషన్ జారీచేయనున్న రాష్ట్రంలోని 60 రీచ్‌ల్లో ప్రస్తుతం ఉన్న ఇసుక కోటి క్యూబిక్ మీటర్లు.
కానీ కాటన్ బ్యారేజి బేసిన్‌లోని ఇసుక మేటల్లోనే కోటి క్యూబిక్ మీటర్లు ఉంటుందని నిపుణుల అంచనా. ఇలాంటి పరిస్థితుల్లో డ్రెడ్జింగ్ కార్యక్రమాన్ని ఎంత వేగంగా చేపడితే, అంత వేగంగా రాష్ట్రంలోని నిర్మాణ రంగానికి ఇసుక కొరత తీరుతుందని నిర్మాణ రంగ నిపుణులు చెబుతున్నారు.
కాగా, రాష్ట్ర ప్రభుత్వం గోదావరిలోని ఇసుకను డ్రెడ్జింగ్ చేసేందుకు డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతోపాటు, మరో ప్రముఖ ప్రైవేటు డ్రెడ్జింగ్ కంపెనీకి అనుమతినిచ్చిన తరువాత కూడా ఇసుక డ్రెడ్జింగ్ ప్రయత్నాలకు ఎందుకు బ్రేకు పడిందో అర్థం కావటం లేదని నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
గోదావరిలో బ్యారేజికి 3 కిలోమీటర్లు దూరం నుండి ఎగువన 7 కిలోమీటర్లు వరకు డ్రెడ్జింగ్ చేస్తేనే కోటి క్యూబిక్ మీటర్లు ఇసుక లభిస్తుందని నిపుణులు అంచనావేస్తున్న నేపథ్యంలో, ఎగువన మరో 35 కిలోమీటర్లు వరకు అఖండ గోదావరిలో ఇసుక డ్రెడ్జింగ్ చేస్తే ఎన్ని కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుక లభిస్తుందో అర్థం చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. కొత్త రాజధాని నిర్మాణానికి, రాష్ట్రంలోని నిర్మాణ రంగం అవసరాలను తీర్చటంతో పాటు, ఇసుక మాఫియా ఆటలకు కూడా అడ్డుకట్ట వేయవచ్చన్నది నిపుణుల వాదన.
ఇలాంటి కీలకమైన డ్రెడ్జింగ్ కార్యక్రమానికి ఎవరు అడు డతగులుతున్నారు? రాజకీయపరమైన కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే అనుమానాలను నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.

గోదావరి నదిలో ఇసుక తవ్వకాలు (ఫైల్ ఫోటో)