బిజినెస్

అంతర్జాతీయ సంకేతాలతో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 13: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. మంగళవారం ప్రకటించిన పారిశ్రామికోత్పత్తి (ఐఐపి), ద్రవ్యోల్బణం గణాంకాలు ప్రతికూలంగా నమోదైనప్పటికీ, కార్పొరేట్ సంస్థల ఆర్థిక ఫలితాలు ఆశించిన స్థాయిలో లేనప్పటికీ మదుపరులు పెట్టుబడులకు ఆసక్తి కనబరిచారు.
నవంబర్‌కుగాను విడుదలైన ఐఐపి మైనస్ 3.2 శాతానికి క్షీణించగా, డిసెంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 5.61 శాతానికి ఎగిసింది. అంతేగాక టిసిఎస్ అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో వెల్లడించిన లాభాలు మార్కెట్ అంచనాలను అందుకోలేకపోయాయి. అయినా వరుస రెండు రోజుల నష్టాల నుంచి సూచీలు కోలుకున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 172.08 పాయింట్లు పుంజుకుని 24,854.11 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 52.10 పాయింట్లు పెరిగి 7,562.40 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల లాభాలతోనే దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో నడవగలిగాయని మార్కెట్ నిపుణులు విశే్లషిస్తున్నారు. ఆయా రంగాలవారీగా ఇంధనం, ఆటో, ఐటి, బ్యాంకింగ్, చమురు, గ్యాస్, టెక్నాలజీ, ఫైనాన్స్, ఎఫ్‌ఎమ్‌సిజి రంగాల షేర్ల విలువ 1.57 శాతం నుంచి 0.21 శాతం పెరిగింది. టెలికామ్, యుటిలిటీస్, క్యాపిటల్ గూడ్స్, పవర్, రియల్టీ రంగాల షేర్ల విలువ 1.72 శాతం నుంచి 1.04 శాతం పడిపోయింది.
అంతర్జాతీయంగా ఆసియా మార్కెట్లలో హాంకాంగ్, జపాన్, సింగపూర్, దక్షిణ కొరియా, తైవాన్ సూచీలు 0.72 శాతం నుంచి 2.88 శాతం లాభపడ్డాయి. చైనా సూచీ షాంగై మాత్రం 2.42 శాతం దిగజారింది. ఐరోపా మార్కెట్లలో ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ సూచీలు 1.31 శాతం నుంచి 1.89 శాతం పెరిగాయి.