బిజినెస్

ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో భారత్‌లో పెట్టుబడులు సాధ్యమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 13: ప్రపంచం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. చైనా, రష్యా వంటి దేశాల ఆర్థిక పరిస్థితులు తలకిందులయ్యాయి. భారత్ మాత్రం సేవా రంగంపై వస్తున్న ఆదాయాన్ని చూపించి, ఆర్థిక ఇబ్బంది లేదని ప్రపంచ దేశాల ముందు చెప్పుకుంటుంటోంది. తయారీ, వ్యవసాయ రంగాలు పూర్తిగా ప్రతికూల పర్థితులను ఎదుర్కొంటున్నప్పటికీ భారత్ మాత్రం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోంది. ఈ నేపథ్యంలో మూడు రోజులపాటు విశాఖలో సిఐఐ ఆధ్వర్యంలో అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సు జరిగింది. 41 దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. కానీ వారి నుంచి ఆశించిన పెట్టుబడులు రాలేదు. దీనికి సంబంధించి వాణిజ్య రంగంలో నిపుణులు చేసిన విశే్లషణ వివరాలు ఇలా ఉన్నాయి.
కుదేలైన చైనా
ఉత్పత్తి, ఎగుమతి రంగాల్లో అగ్రగామిగా ఉన్న చైనా ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా కుదేలైపోయింది. చైనా తన కరెన్సీ యువాన్ మారకం విలువను గణనీయంగా తగ్గించుకుని విదేశాలకు ఎగుమతులను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నా ఫలితాలు కనిపించడం లేదు. చైనా పెద్ద ఎత్తున ఇండస్ట్రియల్ టౌన్‌షిప్‌లను ఏర్పాటు చేయగా, ఇప్పుడు అవి ఎందుకూ కొరగాకుండా పోయాయని విశే్లషకులు చెబుతున్నారు. చైనా ఆర్థిక వ్యవస్థ ఇంతగా కుదేలైపోడానికి కారణం బిలో పావర్టీలైన్ జనాభా అధికం గా ఉండడమేనంటున్నారు. ఆ దేశ స్టాక్ మార్కెట్లూ తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయ.
మినరల్ వాటర్ ధరకు లీటరు ముడి చమురు
ఇదిలా ఉండగా మధ్య ప్రాచ్య దేశాల్లో చమురు ఉత్పత్తి భారీగా పెరిగి, అంతర్జాతీయ మార్కెట్‌లోకి డిమాండ్‌కు మించి సరఫరా జరగడంతో ముడి చమురు ధరలు దారుణంగా క్షీణించాయ. గతంలో 140 డాలర్లు పలికిన బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర ప్రస్తుతం దాదాపు 30 డాలర్ల దరిదాపుల్లో కదలాడుతోంది. అంటే లీటరు క్రూడ్ ఆయిల్ ధర సుమారు 10 రూపాయలకు పడిపోయిందన్నమాట. భారత్‌లో ఒక మినరల్ వాటర్ బాటిల్ ధర కన్నా తక్కువ ధరకు లీటరు క్రూడ్ ఆయిల్ వచ్చేస్తోందన్నమాట. అలాగే మన పొరుగు దేశాలైన పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్థాన్, శ్రీలంక, నేపాల్, తదితర దేశాలు అనేక సమస్యలతో సతమతమవుతున్నాయి. ఈ దేశాలు కూడా ఆర్థిక ఇబ్బందుల్లోనే ఉన్నాయి. అమెరికా, ఐరోపా దేశాలదీ ఇప్పుడిదే పరిస్థితి అని చెప్పుకోవచ్చు.
దేశంలో ప్రతికూల పరిస్థితులు
ఇక మన దేశం విషయానికి వస్తే, గడచిన 12 నెలల నుంచి ఎగుమతులు 20 శాతానికి తగ్గిపోయాయి. తయారీ రంగం వృద్ధి రేటు తాజాగా -3 శాతానికి పడిపోయింది. జిడిపికి ఈ రంగం 24 శాతం ఆదాయాన్ని సమకూర్చుతుంటే, ఇందులో 20 శాతం మందికి మాత్రమే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయి. అలాగే వ్యవసాయ రంగంలో వృద్ధిరేటు -1 శాతానికి పడిపోయింది. భారత దేశంలో పంట భూమి తగ్గిపోవడం వలన వ్యవసా య ఉత్పత్తులు తగ్గిపోయి, ఆహార భద్రత సమస్య తలెత్తడానికి సిద్ధంగా ఉంది. జిడిపికి 17 శాతం ఆదాయాన్ని అందిస్తున్న ఈ రంగంలో 50 శాతం మంది పనిచేస్తున్నారు. ఇక జిడిపికి 58 శాతం ఆదాయాన్ని అందిస్తున్న సేవా రంగంలో 30 శాతం మంది పనిచేస్తున్నారు. అయితే ప్రభుత్వం ఇటీవల సేవా పన్నును గణనీయంగా పెంచడం వలన, వాణిజ్యం తీవ్రంగా దెబ్బతింది. ప్రస్తుతానికైతే ఈ రంగం నుంచి భారీగా ఆదాయం వస్తుండగా, దీన్ని అడ్డం పెట్టుకుని మన దేశం ప్రపంచ దేశాల్లో ఆర్థికంగా బలంగా ఉన్నామని చెప్పుకుంటోంది. ఇక్కడో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. సులభమైన వ్యాపార నిర్వహణలో ప్రపంచంలో మన దేశం నేడు 130వ స్థానంలో ఉండడం గమనార్హం. భారత్ పరిస్థితికి ఈ ర్యాంక్ ఒక నిదర్శనం. ఇటువంటి పరిస్థితుల్లో దేశంలో పెట్టుబడులు పెట్టడానికి ఎంతమంది ముందుకు వస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. విశాఖలో జరిగిన భాగస్వామ్య సదస్సులో 41 దేశాల నుంచి ప్రతినిధులు హాజరైనప్పటికీ, కేవలం 10 విదేశీ కంపెనీలు మాత్రమే, మన దేశంలోని కొన్ని కంపెనీలతో ఎంఓయులు కుదుర్చుకున్నాయి. భాగస్వామ్య సదస్సులో మన దేశానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తలు మాత్రమే పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారు. వీటిలో వ్యవసాయ రంగంలో కనీస పెట్టుబడులు రాకపోవడం గమనార్హం. ఇది అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిగా ప్రభుత్వాలు గుర్తించాల్సి ఉంది. భాగస్వామ్య సదస్సులో సుమారు 5 లక్షల కోట్ల రూపాయల మేరకు ఒప్పందాలు కుదిరాయి. కానీ వీటిలో 20 నుంచి 25 శాతం ఒప్పందాలు మాత్రమే అమలు జరిగే అవకాశం ఉందని విశే్లషకులు చెబుతున్నారు. అయితే, చంద్రబాబు నాయుడుకి పారిశ్రామిక దిగ్గజాలతో ఉన్న స్నేహ సంబంధాలను ఉపయోగించుకుంటే ఇది 30 శాతం వరకూ పెరిగే అవకాశం ఉంటుందని చెపుతున్నారు. ఏదేమైనప్పటికీ విదేశీ పెట్టుబడులు మాత్రం పెరగకపోవచ్చని విశే్లషకులు అభిప్రాయపడుతున్నారు.