బిజినెస్

పురోగతి లేని పోలవరం పవర్ ప్రాజెక్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జనవరి 13: పోలవరం ప్రాజెక్టులో అత్యంత ప్రధానమైన పోలవరం జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణంలో కనీస పురోగతి కూడా కనిపించటం లేదు. పోలవరం హెడ్‌వర్క్స్ నిర్మాణ పనులతో సమానంగానే పోలవరం జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణం కూడా జరగాలి. లేదంటే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తికాదు. హెడవర్క్స్‌లోని అత్యంత కీలకమైన ఎర్త్‌కం రాక్‌ఫిల్ డ్యాంతోపాటు, ఇతర నిర్మాణాలు పూర్తిచేసేందుకు, కొన్నిసార్లు కొండలను పగుల గొట్టేందుకు బాంబులతో పేలుళ్లు జరపాల్సి ఉంటుంది. అలాగే పోలవరం జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణం చేసేందుకు కూడా కొండలను బాంబులతో పేల్చాల్సి ఉంటుంది. ఈ రెండు చోట్లా పేలుళ్లు ఒకేసారి జరగాలి. లేదంటే ఒక ప్రాంతానికి సంబంధించిన పేలుళ్లు, మరో చోట జరిగే నిర్మాణాలకు అవరోధాలను కలిగిస్తుంటాయి. ఈ ఉద్దేశ్యంతోనే పోలవరం ప్రాజెక్టు హెడ్‌వర్క్స్‌లోని ఎర్త్‌కం రాక్‌ఫిల్ డ్యామ్, స్పిల్‌వేతోపాటు, పోలవరం జల విద్యుత్ ప్రాజెక్టులోని ప్రధానమైన తవ్వకం పనులను కూడా జలవనరుల శాఖకే రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. పోలవరం జల విద్యుత్ కేంద్రంలోని పవర్ కాలువలు, ఇతర తవ్వకాల పనులను జల వనరుల శాఖ ఆధ్వర్యంలో జరిగితే, మిగిలిన జల విద్యుత్ కేంద్రం నిర్మాణ పనులను జెన్‌కో చేపడుతుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టులోని డ్యామ్, స్పిల్‌వే నిర్మాణంపై దృష్టికేంద్రీకరిస్తోందే తప్ప, జల విద్యుత్ కేంద్రం నిర్మాణంపై కనీస దృష్టి కేంద్రీకరించటం లేదు. 980 మెగావాట్ల జల విద్యుత్‌ను ఉత్పత్తి చేయగల పోలవరం జల విద్యుత్ కేంద్రాన్ని తూర్పుగోదావరి జిల్లావైపు నిర్మించనున్న సంగతి విదితమే. రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వేగాన్ని పెంచాలన్న ఉద్దేశ్యంతో ప్రధాన కాంట్రాక్టరు నుండి కొన్ని పనులను సబ్ కాంట్రాక్టుకు అప్పగించాలని నిర్ణయించి, ఆ దిశగా కసరత్తు సాగిస్తోంది.
అయితే ప్రాజెక్టులోని అత్యంత కీలకమైన జల విద్యుత్ కేంద్రాన్ని మాత్రం పట్టించుకోవటం లేదు. పోలవరం జల విద్యుత్ కేంద్రం నిర్మాణంలో తొలి దశలో చేపట్టాల్సిన కాలువలు, ఇతర తవ్వకం పనుల్లో సుమారు కోటి 8 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తవ్వాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు కేవలం 23 లక్షల క్యూబిక్ మీటర్ల పనిని అంటే సుమారు 20 శాతం పని మాత్రమే జరిగిందన్న మాట.
పోలవరం ప్రాజెక్టులో ఇతర పనులన్నీ పూర్తయినాగానీ, పోలవరం జల విద్యుత్ కేంద్రం పనులు పూర్తికాకపోతే ఏ మాత్రం ప్రయోజనం ఉండదు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఇతర పనుల మాదిరిగానే జల విద్యుత్ కేంద్రం నిర్మాణ పనుల్లోని సివిల్ పనులను కూడా సబ్‌కాంట్రాక్టుకు ఇవ్వటం ద్వారా పనుల్లో వేగాన్ని పెంచాలని నిపుణులు సూచిస్తున్నారు.