బిజినెస్

27నుంచి సింగరేణిలో ఉద్యోగ మేళా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 20: సింగరేణి ఆణిముత్యాలు కార్యక్రమంలో భాగంగా ఈనెల 27 నుంచి ఫిబ్రవరి 1 వరకు సింగరేణిలోని అన్ని ప్రాంతాల్లో ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు సంస్థ సిఎండి ఎన్ శ్రీధర్ తెలిపారు. ఒక్కో ప్రాంతంలో రెండు రోజులపాటు మేళా జరుగుతుందని, నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ ఉద్యోగ మేళాలో పాల్గొనేందుకు హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో వివిధ సంస్థలు, కంపెనీలు విచ్చేస్తున్నాయని చెప్పారు. ప్రతిభ, నైపుణ్యం ఆధారంగా ఎంపికైన వారికి వేతనం ఉంటుందని, ఎంపిక అనంతరం బయట ప్రదేశాలకు వెళ్లి పనిచేయాల్సి ఉంటుందనీ ఆయన వివరించారు. శ్రీరాంపూర్, రామగుండం-3, కొత్తగూడెం, భూపాలపల్లి ప్రాంతాల్లో జనవరి 27, 28 తేదీల్లో, మందమర్రి, రామగుండం-2, ఇల్లెందు ప్రాంతాల్లో జనవరి 29, 30 తేదీల్లో, బెల్లంపల్లి, రామగుండం-1, మణుగూరు ఏరియాల్లో జనవరి 31, ఫిబ్రవరి 1 తేదీల్లో ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు శ్రీధర్ వెల్లడించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు తమ సర్ట్ఫికెట్లతో సహా హాజరు కావాలని ఆయన సూచించారు.
దక్షిణాఫ్రికాలో ఐసిఐసిఐ బ్యాంక్ శాఖ
న్యూఢిల్లీ, జనవరి 20: ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసిఐసిఐ బ్యాంక్.. దక్షిణాఫ్రికాలో ఓ శాఖను ఏర్పాటు చేసింది. ఆ దేశ రాజధాని జోహెనె్నస్‌బర్గ్‌లోని శాండ్టన్ వద్ద ఈ శాఖను ప్రారంభించింది. ఈ మేరకు ఓ ప్రకటనలో బుధవారం బ్యాంక్ తెలిపింది. దక్షిణాఫ్రికా రిజర్వ్ బ్యాంక్ ఈ శాఖను ధ్రువీకరించినట్లు చెప్పింది. కాగా, గడచిన పదేళ్లకుపైగా భారత్-ఆఫ్రికా మధ్య బలపడుతున్న వాణిజ్య సంబంధాలకు తమ ఈ నూతన శాఖను నిదర్శనంగా ఐసిఐసిఐ బ్యాంక్ అభివర్ణించింది.
పోర్షే కొత్త కారు ధర రూ. 1.04 కోట్లు
న్యూఢిల్లీ, జనవరి 20: జర్మనీకి చెందిన లగ్జరీ స్పోర్ట్స్ కార్ల తయారీ సంస్థ పోర్షే.. బుధవారం భారతీయ మార్కెట్‌లోకి సరికొత్త కారును తీసుకొచ్చింది. ఈ పనమెర డీజిల్ ఎడిషన్ కారు ధర మహారాష్ట్ర ఎక్స్‌షోరూం ప్రకారం 1.04 కోట్ల రూపాయలు. 250 హార్స్ పవర్ ఇంజిన్ ఈ కారు సొంతమని, ఎన్నో అధునాతన ఫీచర్లు కలిగిన ఇది వినియోగదారులను అబ్బురపరుస్తుందన్న విశ్వాసాన్ని సంస్థ ఈ సందర్భంగా వ్యక్తం చేసింది.