బిజినెస్

చమురు నిక్షేపాల అనే్వషణకు ఒఎన్‌జిసి ప్రత్యేక ప్రణాళిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జనవరి 20: ప్రభుత్వరంగ చమురు, సహజవాయువు అనే్వషణ దిగ్గజం ఒఎన్‌జిసి.. రాజమహేంద్రవరం పరిసరాల్లోగల చమురు, సహజవాయువు నిక్షేపాలను కనుగొనడానికి ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసింది. కొత్త నిక్షేపాలను కనుగొనడానికి ప్రస్తుతం జరుగుతున్న అనే్వషణ కార్యక్రమాల్లో వేగం పెంచేందుకు ఇప్పుడున్న ఏర్పాట్లను రెట్టింపు చేయాలని ఒఎన్‌జిసి భావిస్తోంది. కొత్త చమురు, సహజవాయువు క్షేత్రాలను కనుగొనడానికి ఒఎన్‌జిసి ఇప్పటివరకు ఏడాదికి 8 నుండి 9 వరకు మాత్రమే బావులను తవ్వుతోంది. ఇక నుండి ఇలాంటి బావుల డ్రిల్లింగ్ కార్యకలాపాలను పెంచాలన్నది ఒఎన్‌జిసి ప్రణాళిక. ఒఎన్‌జిసి ఖరారు చేసుకున్న ఏక్సలరేటెడ్ ఎక్స్‌ప్లోరేషన్ ప్లాన్ ప్రకారం 2015-16 నుండి 2019-20 ఆర్థిక సంవత్సరం వరకు కొత్త క్షేత్రాలను కనుగొనేందుకు 77 బావులను డ్రిల్లింగ్ చేయాల్సి ఉంటుంది. అంటే కెజి బేసిన్‌లో ప్రస్తుతం ఉన్న కార్యకలాపాలు రెట్టింపవుతాయన్న మాట. ఈ లక్ష్యాన్ని నిర్దేశిత గడువులో సాధించాలంటే ప్రస్తుతం ఉన్న రిగ్గులు సరిపోవు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఒఎన్‌జిసి అత్యంత అధునాతన ‘టైప్ ఫోర్’ రిగ్గులను అంతర్జాతీయ మార్కెట్ నుండి అద్దె ప్రాతిపదికన సమకూర్చుకోబోతోంది. కృష్ణా జిల్లాలోని నాగాయలంక క్షేత్రం నుండి చమురును ఈ ఏడాదే ఉత్పత్తి చేయాలన్న లక్ష్యంతో రాజమహేంద్రవరం ఒఎన్‌జిసి అసెట్ ఉంది. కొత్త లైసెన్సింగ్ విధానంలో 5వ రౌండ్ బిడ్డింగ్‌లో ఒఎన్‌జిసి, కెయిర్న్ ఎనర్జీ భాగస్వామ్యంతో దక్కించుకున్న నాగాయలంక క్షేత్రంలో ఇప్పటివరకు 7 బావులను డ్రిల్లింగ్ చేశారు. ఇందులో రెండింటిలో చమురు, సహజవాయువు ఉన్నట్టు ఒఎన్‌జిసి గుర్తించింది. ఈ మధ్యనే ఆపరేషన్ కార్యకలాపాలను ఒఎన్‌జిసికి కెయిర్న్ ఎనర్జీ అప్పగించింది. దాంతో ఒఎన్‌జిసి ఫీల్డ్ డెవలప్‌మెంట్ ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ ప్రణాళికకు ఒఎన్‌జిసి బోర్డూ ఆమోదముద్ర వేయగా, రానున్న మూడేళ్లలో ఒఎన్‌జిసి 20 బావులను నాగాయలంక క్షేత్రంలో డ్రిల్లింగ్ చేయడానికి ప్రణాళికను రూపొందించింది. ఈ క్షేత్రంలో రోజుకు 9 వేల బ్యారెళ్ల చమురు, 5 లక్షల క్యూబిక్ మీటర్ల సహజవాయువును ఉత్పత్తి చేయవచ్చన్నది నిపుణుల అంచనా. ప్రస్తుతం రాజమహేంద్రవరం ఒఎన్‌జిసి అసెట్‌లో రోజుకు 6,040 బ్యారెళ్ల చమురు, 1.68 లక్షల క్యూబిక్ మీటర్ల సహజవాయువు మాత్రమే ఉత్పత్తవుతోంది. అంటే నాగాయలంక క్షేత్రంలో పూర్తిస్థాయిలో చమురు ఉత్పత్తి మొదలైతే ప్రస్తుతం కెజి బేసిన్‌లో ఉత్పత్తవుతున్న ముడి చమురులో 150 శాతం, సహజవాయువులో 35 శాతం పెరుగుదల కనిపిస్తుందన్న మాట.
గ్యాస్ డిహైడ్రేటింగ్ యూనిట్లు
కోనసీమలోని నగరం దుర్ఘటన తరువాత మరింత అప్రమత్తమైన ఒఎన్‌జిసి.. పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు మార్గదర్శకాల ప్రకారం గ్యాస్ డిహైడ్రేటింగ్ యూనిట్లు(జిడియు) నెలకొల్పే కార్యక్రమాన్ని చేపట్టింది. పైపులైన్ నెట్‌వర్క్‌ను మరింత భద్రంగా ఉంచటంతోపాటు తేమ రహిత గ్యాస్‌ను సహజవాయువు వినియోగదారులకు అందించేందుకు జిడియు యూనిట్లను నెలకొల్పుతోంది. కోనసీమలోని మోరి, పాశర్లపూడి, మండపేట, గోపవరం, పశ్చిమగోదావరి జిల్లాలోని నర్సాపురంలో జిడియులను ఏర్పాటు చేసింది. తరువాత దశలో తాటిపాక, ఎండమూరు, ఓడలరేవు, కేశనపల్లి వెస్ట్‌లో ఏర్పాటు చేయనుంది. ఈ యూనిట్లను నెలకొల్పేందుకు సుమారు రూ. 300 కోట్లు ఒఎన్‌జిసి ఖర్చు చేస్తోంది. చమురు, సహజవాయువు ఉత్పత్తిని పెంచేందుకు ప్రణాళికలు సిద్ధంచేస్తూనే మరోపక్క సోలార్ విద్యుదుత్పత్తి చేసేందుకూ ఏర్పాట్లు చేస్తోంది.

దొనకొండలో భూములను పరిశీలించిన చైనా, దుబాయ్ పారిశ్రామికవేత్తలు

దొనకొండ, జనవరి 20: ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలోని వేలాది ఎకరాల ప్రభుత్వ భూములను పలు రకాల పరిశ్రమల ఏర్పాటు కోసం చైనా, దుబాయ్ పారిశ్రామికవేత్తల బృందాలు బుధవారం సాయంత్రం పరిశీలించాయ. భూములు పరిశీలించిన పారిశ్రామికవేత్తల బృందాలకు వౌలిక వసతుల గురించి జెసి హరిజవహర్‌లాల్ వివరించారు. అనంతరం జెసి విలేఖరులతో మాట్లాడుతూ చైనాలోని సినెట్ కంపెనీకి చెందిన టోనీ, దుబాయ్‌లోని హబీబ్‌గ్రూప్ ఆఫ్ కంపెనీ అధినేత హబీబ్‌కబీలకు భారతదేశంలో భాగస్వామ్యం ఉన్న రామరాజుతో కలిసి ఈ భూములను పరిశీలించారన్నారు. కన్‌స్ట్రక్షన్ మెగాపార్కు కోసం ఈ భూములను పరిశీలించినట్లు ఆయన వివరించారు. గుజరాత్ రాష్ట్రంలో కూడా ఈ కంపెనీ స్థాపనకు అనుమతి పొందారని, ఆంధ్రాలో కూడా ప్రభుత్వం వెంటనే స్పందిస్తే ఇక్కడ కూడా కంపెనీని ప్రారంభిస్తారని తెలిపారు. కాగా, ఇండ్లచెరువు, పోచమక్కపల్లి, రాగమక్కపల్లి, భూమనపల్లి, రుద్రసముద్రం గ్రామాల్లో విస్తారంగా ఉన్న వేలాది ఎకరాల ప్రభుత్వ భూములను వీరు పరిశీలించి వౌలిక వసతుల కోసం ఆరా తీశారు. దీంతో జెసి హరిజవహర్‌లాల్ 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న సాగర్ జలాలు, దొనకొండలో ఉన్న విమానాశ్రయం, ఇండస్ట్రియల్ కారిడార్ కింద దొనకొండ వయా అద్దంకి, దొనకొండ-తోకపల్లి, దొనకొండ-పొదిలి, దొనకొండ-రాజధాని తుళ్లూరుకు రహదారులు నిర్మించే అంశాలను మ్యాప్ ద్వారా పారిశ్రామిక బృందాలకు వివరించారు.