బిజినెస్

యాక్సిస్ బ్యాంక్ నికర లాభం రూ. 2,175 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 20: ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్ సంస్థ యాక్సిస్ బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం (2015-16) మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో 2,175 కోట్ల రూపాయల నికర లాభాన్ని అందుకుంది. గత ఆర్థిక సంవత్సరం (2014-15) అక్టోబర్-డిసెంబర్‌తో పోల్చితే ఇది 15 శాతం అధికం. పోయినసారి 1,900 కోట్ల రూపాయల నికర లాభాన్ని బ్యాంక్ నమోదు చేసింది. ఆదాయం ఈసారి 12,531 కోట్ల రూపాయలుగా ఉంటే, క్రిందటిసారి 10,929 కోట్ల రూపాయలుగా ఉంది. ఇకపోతే గత ఏడాది అక్టోబర్-డిసెంబర్‌లో స్థూల నిరర్థక ఆస్తులు (జిఎన్‌పిఎ) 1.34 శాతం నుంచి 1.68 శాతానికి పెరిగాయి. ఇదే సమయంలో బ్యాంక్ నికర నిరర్థక ఆస్తులు (ఎన్‌ఎన్‌పిఎ) 0.44 శాతం నుంచి 0.75 శాతానికి చేరుకున్నాయి. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో (ఏప్రిల్-డిసెంబర్) బ్యాంక్ నికర లాభం 6,069 కోట్ల రూపాయలుగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో 5,177 కోట్ల రూపాయలుగా ఉంది.

టెలికామ్ శాఖకు రూ. 5,400 కోట్లు చెల్లించిన ఆర్‌కామ్

న్యూఢిల్లీ, జనవరి 20: టెలికామ్ శాఖకు స్పెక్ట్రమ్ లిబరలైజేషన్ ఫీజుగా 5,383.84 కోట్ల రూపాయలను చెల్లించినట్లు బుధవారం రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) తెలిపింది. 16 టెలికామ్ సర్కిళ్లలోగల 800/850 మెగాహెట్జ్ బ్యాండ్‌లో రేడియో తరంగాల లిబరలైజేషన్‌కు సంబంధించి ఈ ఫీజును చెల్లించినట్లు అనిల్ అంబానీ నేతృత్వంలోని టెలికామ్ సంస్థ అయిన ఆర్‌కామ్ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. కాగా, సోమవారం రిలయన్స్ కమ్యూనికేషన్స్, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ స్పెక్ట్రమ్ ట్రేడింగ్, షేరింగ్ అగ్రిమెంట్లను చేసుకున్నది తెలిసిందే.