బిజినెస్

పారిశ్రామికవేత్తల్లో సంతోషం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 21: తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన తరువాత పారిశ్రామిక వేత్తలు, కార్మికులు సంతోషంగా ఉన్నారని వారి మద్దతు టిఆర్‌ఎస్‌కేనని ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తెలిపారు. నగరంలోని చర్లపల్లి పారిశ్రామిక వాడలో పారిశ్రామిక వేత్తలు, కార్మికులు గురువారం సంఘీభావ సభ నిర్వహించారు. ఈ సభలో కెటిఆర్ మాట్లాడుతూ, గతంలో హైదరాబాద్‌లో విద్యుత్ కోతలు నిత్యకృత్యంగా ఉండేవని తెలిపారు. వేసవి వచ్చిందంటే పవర్ హాలీడే ప్రకటించేవారని తెలిపారు. వారానికి రెండు మూడు రోజుల పాటు పవర్ హాలిడే ప్రకటించడం వల్ల అనేక చిన్న పరిశ్రమలు మూతపడ్డాయి, పారిశ్రామిక వేత్తలు, కార్మికులు ఇబ్బందుల పాలయ్యారని గుర్తు చేశారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాది లోపే విద్యుత్ కోతలనేవి లేకుండా పోయాయని గుర్తు చేశారు. హైదరాబాద్‌లో 24 గంటల పాటు విద్యుత్ సరఫరా జరుగుతోందని, పరిశ్రమలకు నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తున్నట్టు గుర్తు చేశారు. దీని వల్ల పారిశ్రామిక వేత్తలు, కార్మికుల్లో సంతోషం కనిపిస్తోందని చెప్పారు. హైదరాబాద్ కోసం ప్రత్యేకంగా విద్యుత్ లైన్లు వేస్తున్నట్టు రెప్పపాటు కాలం కూడా విద్యుత్ కోత ఉండని విధంగా ఈ ప్రాజెక్టు ఉంటుందని తెలిపారు. నిరంతర విద్యుత్ సరఫరా వల్ల పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. హైదరాబాద్‌కు ఉజ్వలమైన భవిష్యత్తు ఉందని తెలిపారు. విశ్వనగరంగా హైదరాబాద్ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి ప్రణాళికలు రూపొందించారని తెలిపారు. గతంలో అన్ని పార్టీలకు హైదరాబాద్‌లో అవకాశం కల్పించారు, ఒకసారి టిఆర్‌ఎస్‌కు అవకాశం కల్పించమని కోరుతున్నట్టు చెప్పారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్‌గా నిలుస్తోందని తెలిపారు. ప్రజల్లో కెసిఆర్ పట్ల విశ్వాసం ఉందని, గ్రేటర్ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ విజయం సాధిస్తుందని అన్నారు. ఎమ్మెల్లీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి టిఆర్‌ఎస్ నాయకులు బొంతు రామ్మోహన్ తదితరులు ప్రసంగించారు.

పన్ను చట్టాలనూ మారుస్తున్నాం : జైట్లీ

సింగపూర్, జనవరి 21: భారత దేశం తన పన్ను చట్టాలను మరింత సుస్థిరత, ఊహించదగ్గవిగా ఉండే దిశగా మారుస్తోందని, ఇంతకు ముందు పెండింగ్‌లో ఉన్న వివాదాలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం చెప్పారు. ‘మా పన్ను చట్టాలన్నిటినీ క్రమంగా మార్పు చేయడం, చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న వివాదాలకు తెరదించడం, వివక్షకు అవకాశాలను తొలగించడం, పన్ను చట్టాలకు సంబందించినంతవరకు వీలయినంత ఎక్కువ సుస్థిరత, ఊహించదగ్గవిగా ఉండేలా చూడడానికి భారత్‌లో మేము కృషి చేస్తున్నాం’ అని గురువారం ఇక్కడ ‘ఆసియాలో వ్యాపారం’పై ఏర్పాటు చేసిన అంతర్జాతీయ సదస్సులో మాట్లాడుతూ జైట్లీ చెప్పారు. భారత్‌లో వ్యాపారం చేయడం మరింత సులభతరం చేయడానికి రాష్ట్రాల మధ్య తేడాలను తగ్గించడం, అంతర్రాష్ట వ్యాపారానికి ఉన్న అడ్డంకులను తొలగించడం చేయాల్సిన అవసరం ఉందని జైట్లీ అన్నారు. ప్రతిపాదిత వస్తు సేవల పన్ను( జిఎస్‌టి) ఈ దిశగా తీసుకోబోయే ప్రధాన చర్యగా ఉంటుందని ఆయన అన్నారు. దీనివల్ల పన్ను రేట్లు ఒకే విధంగా ఉంటాయని, అంతేకాకుండా వ్యాపారులు చట్టాలను మరింతగా పాటించడం కూడా జరుగుతుందని, అంతేకాకుండా దేశ జిడిపి వృద్ధికి సైతం ఇది తోడ్పడుతుందని ఆయన చెప్పారు. వందకోట్లకు పైబడిన జనాభా, భిన్న సంస్కృతులతో ఉన్నప్పటికీ భారత్ రాజకీయంగా , ఆర్థికంగా కలిసికట్టుగా ఉందంటే అది తమ సొంత చట్టాలను, నిబంధనలను రూపొదించుకోవడానికి రాష్ట్రాలకు ఇచ్చిన స్వేచ్ఛే కారణమని జైట్లీ చెప్పారు. కొంత మేరకు భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడం కూడా రకరకాల విధానాలతో ప్రయోగాలు చేయడానికి అవకాశమిస్తుందని ఆయన చెప్పారు.