బిజినెస్

ఎగుమతులకు అనువైన వాతావరణం సృష్టించాలి: జైట్లీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 27: అంతర్జాతీయంగా మందగమనం, నానాటికి దేశీయ ఎగుమతులు పడిపోవడంపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఆందోళన వ్యక్తం చేశారు. విదేశీ మార్కెట్లలో భారత ఎగుమతుల బలోపేతానికి కావాల్సిన పరిస్థితులను సృష్టించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ క్రమంలోనే ఆయన ఎగుమతిదారులకు పోటీ ధరలకు నాణ్యమైన ఉత్పత్తులను ఎగుమతి చేయాలని సూచించారు.
ఫలితంగా అంతర్జాతీ మార్కెట్‌లో ఇతర దేశాల సంస్థల ఉత్పత్తులపై పైచేయి సాధించవచ్చన్నారు. ‘ప్రపంచం ఇప్పుడు తక్కువ ధరకే నాణ్యమైన ఉత్పత్తుల వైపు చూస్తోంది. ఆ దిశగా వెళ్తేనే మనం నిలదొక్కుకోగలం.’ అన్నారు. శుక్రవారం ఇక్కడ ముగిసిన 14 రోజుల భారత అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జైట్లీ పాల్గొని మాట్లాడారు.
మొండి బకాయిలపై ఉన్నతస్థాయి కమిటీ
ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ప్రమాదకర స్థాయికి చేరిన మొండి బకాయిల (ఎన్‌పిఎ లేదా నిరర్థక ఆస్తులు) అదుపునకు ఓ ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. ఈ విషయాన్ని ఆర్థిక సేవల కార్యదర్శి అంజులి చిబ్ దుగ్గల్ తెలిపారు. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పడే వీలుందన్నారు.

ముంబయలో ఉద్యోగుల ఆందోళన

వడ్డీరేట్లను
తగ్గించిన ఎస్‌కెఎస్
న్యూఢిల్లీ, నవంబర్ 27: సూక్ష్మ రుణాల సంస్థ ఎస్‌కెఎస్ మైక్రోఫైనాన్స్ శుక్రవారం వడ్డీరేట్లను 1 శాతం మేర తగ్గించింది. డిసెంబర్ 7 నుంచి తగ్గించిన వడ్డీరేట్లు అమల్లోకి వస్తాయని ప్రకటించింది. కాగా, గత ఏడాది అక్టోబర్ నుంచి ఇప్పటిదాకా మొత్తం 4.8 శాతం మేర వడ్డీరేట్లను ఎస్‌కెఎస్ తగ్గించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) రెపో, రివర్స్ రెపో వడ్డీరేట్లను అర శాతం తగ్గించిన నేపథ్యంలో ఈ సెప్టెంబర్‌లోనూ 1.25 శాతం తగ్గించింది. హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా ఎస్‌కెఎస్ మైక్రోఫైనాన్స్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.