బిజినెస్

దేశంలోనే అతిపెద్ద రిఫైనరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 26: ప్రభుత్వరంగ చమురు సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఒసి), భారత్ పెట్రోలియం కార్ప్ లిమిటెడ్ (బిపిసిఎల్), హిందుస్థాన్ పెట్రోలియం కార్ప్ లిమిటెడ్ (హెచ్‌పిసిఎల్), పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్ (ఇఐఎల్) కలిసి దేశంలోనే అతిపెద్ద రిఫైనరీని 1.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్నాయని చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. మహారాష్టల్రో ఏటా 60 మిలియన్ టన్నుల చమురు శుద్ధి సామర్థ్యం కలిగిన ప్లాంట్‌ను నిర్మిస్తున్నాయని ట్విట్టర్ ద్వారా ప్రధాన్ తెలియజేశారు. ఈ రిఫైనరీని రెండు దశల్లో నిర్మించనున్నారని మొదటి దశలో 40 మిలియన్ టన్నులు, రెండవ దశలో 20 మిలియన్ టన్నుల చమురు శుద్ధి సామర్థ్యాన్ని అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందని వివరించారు. ఈ క్రమంలో మొదటి దశలో లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులను, రెండవ దశలో 50,000 కోట్ల రూపాయల పెట్టుబడులను చమురు మార్కెటింగ్ సంస్థలు పెట్టనున్నట్లు పేర్కొన్నారు. మిలియన్ టన్ను చమురు శుద్ధి సామర్థ్యానికి 2,500 కోట్ల రూపాయల వ్యయం కానుంది. దీంతో 60 మిలియన్ టన్నులకు 1.5 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు కానున్నాయి. మరోవైపు ఇప్పటిదాకా ప్రభుత్వరంగ చమురు సంస్థలు ఏర్పాటు చేసిన రిఫైనరీల్లో తొలి దశలో 15 మిలియన్ టన్నుల సామర్థ్యం మించలేదు. ఇటీవల ఒడిషాలోని పారదీప్‌లోనూ 15 మిలియన్ టన్నుల సామర్థ్యంతో ఓ యూనిట్‌ను ఐఒసి ప్రారంభించింది. అయితే ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మాత్రం గుజరాత్‌లోని జమ్‌నగర్‌లో తొలి దశలోనే 27 మిలియన్ టన్నుల సామర్థ్యంతో రిఫైనరీని నిర్మించింది. అనంతరం దాన్ని 33 మిలియన్ టన్నులకు విస్తరించగా ఇప్పటిదాకా భారత్‌లో ఇదే రికార్డు. ఈ నేపథ్యంలో మహారాష్టల్రో ప్రభుత్వరంగ చమురు సంస్థలు నిర్మించాలనుకుంటున్న రిఫైనరీ ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే మరో రిఫైనరీని 29 మిలియన్ టన్నుల సామర్థ్యంతో రిలయన్స్ నిర్మించాలనుకుంటోంది. కానీ ప్రభుత్వరంగ చమురు సంస్థలు నిర్మించబోయేదే పెద్దది కానుంది. కాగా, ఉత్తరాదినే అధికంగా ఐఒసి రిఫైనరీలుండటంతో పశ్చిమ, దక్షిణాది ప్రాంతాల్లోని వినియోగదారులకు ఇంధనాన్ని ఐఒసి ఆశించిన స్థాయిలో సమకూర్చలేకపోతోంది. హెచ్‌పిసిఎల్, బిపిసిఎల్ పరిస్థితీ ఇంచుమించు ఇంతే. ముంబయిలో డిమాండ్‌కు తగ్గ ఇంధనాన్ని ఇవి అందించలేకపోతున్నాయి. ఈ క్రమంలోనే ఈ ప్రాంతంలో ఓ భారీ రిఫైనరీ ఏర్పాటుకు సంస్థలు ముందుకొచ్చాయి. ఇకపోతే ఈ రిఫైనరీ పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ఎల్‌పిజితోపాటు విమానయాన ఇంధనం ఎటిఎఫ్‌ను ఉత్పత్తి చేస్తుంది. మహారాష్టల్రోని కెమికల్, టెక్స్‌టైల్, ప్లాస్టిక్ పరిశ్రమలతోపాటు పెట్రోకెమికల్ ప్లాంట్లకు అవసరమైన చమురునూ అందిస్తుందని మంత్రి స్పష్టం చేశారు. సోమవారం ఈ ప్లాంట్ ఏర్పాటుపై ముంబయిలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తోనూ మంత్రి ప్రధాన్ చర్చించారు. ‘ఈ రిఫైనరీ ప్రాజెక్టుకు కావాల్సిన భూమిని త్వరగా గుర్తించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం, పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ తీవ్రంగా కృషి చేస్తోంది.’ అని కూడా ఈ సందర్భంగా ధర్మేంద్ర ప్రధాన్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఇదిలావుంటే మహారాష్టల్రో ఈ భారీ రిఫైనరీని ఏర్పాటు చేయడం వల్ల మధ్యప్రాచ్య, ఆఫ్రికా దేశాల నుంచి దిగుమతి చేసుకునే ముడి చమురును కూడా వేగంగా అందుకోవచ్చని చమురు సంస్థలు భావిస్తున్నాయి. దీనివల్ల రవాణా ఖర్చు కలిసి రానుంది. ఐఒసికి ప్రస్తుతం దేశంలో ఆరు రిఫైనరీలుండగా, వీటి సామర్థ్యం 54.20 మిలియన్ టన్నులు. అలాగే ఐఒసికి 11.50 మిలియన్ టన్నుల సామర్థ్యం కలిగిన అనుబంధ రిఫైనరీలు కూడా ఉన్నాయి. తాజాగా పారదీప్ వద్ద ఏర్పాటుచేసిన రిఫైనరీతో ఐఒసి చమురు శుద్ధి సామర్థ్యం ఏటా 80.7 మిలియన్ టన్నులకు చేరింది.