బిజినెస్

వౌలిక సదుపాయాలకు రూ. 1,300 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 26: తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి విద్యుత్ కోతలు లేకుండా నిరంతరం విద్యు త్ సరఫరా చేయాలన్న లక్ష్యాన్ని సాధించామని, పంటలు ఎండిపోకుండా అన్ని చర్యలు తీసుకున్నామని సదరన్ పవర్ డిస్కాం సిఎండి జి రఘుమారెడ్డి తెలిపారు. అలాగే విద్యుత్ రంగంలో వౌలిక సదుపాయాల కల్పన కోసం సదరన్ డిస్కాంలో 1,300 కోట్ల రూపాయలతో వివిధ పనులు చేపట్టి పూర్తి చేస్తున్నట్లు చెప్పారు. మంగళవారం ఇక్కడ ఆయన తెలంగాణ సదరన్ డిస్కాం కార్యాలయంలో 67వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది ఏప్రిల్ నుంచి వ్యవసాయానికి తొమ్మిది గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తామని స్పష్టంచేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ విద్యుత్ ప్రాజెక్టుల వివరాలను తెలిపారు. ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు సారథ్యంలో జెన్కో సిఎండి డి ప్రభాకరరావు, ఇతర విద్యుత్ రంగ నిపుణులు ప్రతిరోజూ విద్యుత్ రంగాన్ని పర్యవేక్షిస్తూ అనేక చర్యలు తీసుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఆపరేషన్స్ జె శ్రీనివాసరెడ్డి, మానవవనరుల విభాగం డైరెక్టర్ మీర్ కమాలుద్దీన్ అలీ ఖాన్, ప్రాజెక్టులు కమ్యూనికేషన్స్ డైరెక్టర్ టి శ్రీనివాస్ పాల్గొన్నారు. కాగా, ఈ ఏడాది తెలంగాణ ఆర్టీసిని బలోపేతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని తెలంగాణ ఆర్టీసి జెఎండి జివి రమణారావు తెలిపారు. ఆయన ఆర్టీసి బస్‌భవన్‌లో జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల సంక్షేమానికి అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. మరోవైపు సింగరేణి భవన్‌లో ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ ఎన్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరంలో బొగ్గు ఉత్పత్తి రవాణాలో అనేక రికార్డులు సాధించామన్నారు. సంస్థను అభివృద్ధి బాటలో పయనింపచేస్తూ బంగారు తెలంగాణ నిర్మాణానికి దీక్ష వహిస్తామన్నారు. కాగా, విజిలెన్స్ వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీలో ప్రథమ స్థానం పొందిన పబ్లిక్ రిలేషన్స్ అసిస్టెంట్ కెవి రమణకు ప్రశంసా పత్రం, బహుమతిని అందజేశారు.

సదరన్ డిస్కాం కార్యాలయంలో
జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో
సిఎండి రఘుమారెడ్డి