బిజినెస్

పదవీ విరమణ చేసిన కార్మికులకు వైద్య సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 27: సింగరేణి సంస్థలో పదవీ విరమణ చేసిన కార్మికులకు వైద్య సౌకర్యం కల్పించే ప్రతిపాదిత కాంట్రిబ్యూటరీ పోస్ట్ రిటైర్‌మెంట్ మెడికల్ స్కీం (సిపిఆర్‌డి)కు ఆసక్తి వ్యక్తీకరణ దరఖాస్తులు స్వీకరించేందు గడువును ఫిబ్రవరి 20 వరకు పెంచినట్లు సింగరేణి యాజమాన్యం తెలిపింది. గత నెలలో ఈ పథకానికి దరఖాస్తు చేసేందుకు జనవరి 20 చివరి తేదీగా ప్రకటించిన యాజమాన్యం.. గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల అభ్యర్థన మేరకు దరఖాస్తులు స్వీకరించే గడువును మరో నెల రోజులపాటు పెంచుతూ బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. పదవీ విరమణ చేసిన కార్మికులు సింగరేణి ప్రాంతాలకు దూరంగా పల్లెల్లో చాలామంది ఉన్నందున ఈ సమాచారం వారికి తెలిసి ఉండకపోవచ్చని కార్మిక సంఘాలు సింగరేణి దృష్టికి తేవడంతో యాజమాన్యం తరఫున డైరక్టర్ జె పత్రిన్ కుమార్ వివరణ ఇస్తూ గడువు తేదీని పెంచినట్లు తెలిపారు. గడువు పెంపు వల్ల మరికొందరు దరఖాస్తు చేసుకునేందుకు వీలుంటుందని వెల్లడించారు. రిటైరైన కార్మికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
700 మెగాహెట్జ్ బ్యాండ్
బేస్ రేటు రూ. 11,485 కోట్లు
సిఫార్సు చేసిన ట్రాయ్
న్యూఢిల్లీ, జనవరి 27: టెలికామ్ రెగ్యులేటర్ ట్రాయ్ దేశవ్యాప్తంగా 700 మెగాహెట్జ్ స్పెక్ట్రమ్ ధరను మెగాహెట్జ్‌కు 11,485 కోట్ల రూపాయలుగా నిర్ణయించింది. ఇది టెలికామ్ ప్రీక్వెన్సీ బ్యాండ్ ధరల్లో అన్నింటికంటే అత్యధికమవగా, అత్యున్నత శ్రేణి మొబైల్ సేవలకు వినియోగించే 700 మెగాహెట్జ్ స్పెక్ట్రమ్‌కు బేస్ రేటును ట్రాయ్ ప్రతిపాదించడం ఇదే తొలిసారి. కాగా, బుధవారం మొత్తం ఏడు బ్యాండ్ల ధరలను ట్రాయ్ సిఫార్సు చేసింది. ఇందులో 700 మెగాహెట్జ్‌తోపాటు 800 మెగాహెట్జ్, 1800 మెగాహెట్జ్, 2100 మెగాహెట్జ్ బ్యాండ్లున్నాయి. 800 మెగాహెట్జ్‌లో మెగాహెట్జ్ ధరను 2,873 కోట్ల రూపాయలుగా ట్రాయ్ నిర్ణయించింది.