బిజినెస్

అలివిరా పరిశ్రమ మూసివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 27: విశాఖపట్నంలోని పరవాడ జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మాసిటీలోగల అలివిరా ఎనిమల్ హెల్త్ లిమిటెడ్ పరిశ్రమను తదుపరి ఉత్తర్వులు జారీ చేసేదాకా మూసివేయాలని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ బోర్డు ఆదేశించింది. ఈ నెల 25న అలివిరా ఎనిమల్ హెల్త్ లిమిటెడ్ ప్రాసెసింగ్ డెవలెప్‌మెంట్ ల్యాబ్ (బ్లాక్-2)లో జరిగిన అగ్నిప్రమాదంపై స్పందించిన బోర్డు విచారణ చేపట్టింది. ఈ విచారణ నివేదికలో వాస్తవాలు తమ దృష్టికి రావడంతో ఆ పరిశ్రమను మూసివేస్తూ ఉత్తర్వులు జారీ చేశామని బుధవారం బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. బోర్డు చైర్మన్ డాక్టర్ ఫణికుమార్ ఆదేశాల మేరకు విశాఖపట్నం జోన్, రీజనల్ అధికారులను విచారణ అధికారులుగా నియమించగా, ప్రమాదంపైనా, కంపెనీ నుంచి వెలువడుతున్న కాలుష్యంపైనా విచారణ జరిపారు. పరిమాణానికి మించి కాలుష్య రసాయనాలు, వాయువులు వెలువడినట్లు గుర్తించారు. కాగా, ఈ పరిశ్రమ తమ కార్యకలాపాలు నిర్వహించేందుకుగాను అవసరమైన అనుమతి ఈ ఏడాది మార్చి వరకు మాత్రమే ఉందని బోర్డు తెలిపింది. మరోవైపు ల్యాబ్ నుంచి బయట ప్రాంతాలకు రసాయన వాయువులు బయటకు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, పరిశ్రమ పరిసరాలు కాలుష్యానికి గురికాకుండా చూడాలనే నిబంధన తమ అనుమతిలో ఉందని బోర్డు వెల్లడించింది. వీటిని ఉల్లంఘించినట్లు నిర్ధారణ కావడంతో ఏపి కాలుష్య నివారణ, నియంత్రణ చట్టం 1987, నీటి కాలుష్యం నివారణ చట్టం 1988ని అనుసరించి పరిశ్రమను మూసివేయాలని ఆదేశించినట్లు బోర్డు ఆ ప్రకటనలో వెల్లడించింది.