బిజినెస్

వేతనం పెంపు.. సర్కారుకు సమస్యే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 20: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలను 23.6 శాతం పెంచాలంటూ 7వ వేతన సంఘం చేసిన సిఫార్సు అమలుతో ఆర్థికంగా ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవన్న ఆందోళనను వ్యక్తం చేస్తున్నాయి రేటింగ్, బ్రోకరేజ్ ఏజెన్సీలు. అయితే ఆర్థిక లోటు లక్ష్యాలకు భంగం వాటిల్లకుండా, నిర్దేశిత లక్ష్యాలను సాధిస్తామన్న విశ్వాసాన్ని కేంద్ర ప్రభుత్వం కనబరుస్తోంది. బడ్జెట్‌లో ప్రతిపాదించినట్లుగానే ద్రవ్యలోటును కట్టడి చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా ధీమా వెలిబుచ్చారు. మరోవైపు ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ సైతం ద్రవ్యలోటు లక్ష్యాన్ని సాధిస్తామన్నారు. వేతన సంఘం సిఫార్సులతో ఖజానాపై పడే భారం వచ్చే ఆర్థిక సంవత్సరంలో అధికంగా ఉండొచ్చని, అప్పటి నుంచే వేతన సంఘం సిఫార్సులు అమలు కావచ్చన్నారు. అయినప్పటికీ ఫిచ్, ఎస్‌అండ్‌పి రేటింగ్ ఏజెన్సీలతోపాటు సిటి, స్టాండర్డ్ చార్టర్డ్, డిబిఎస్ వంటి బ్రోకరేజ్ సంస్థలు ద్రవ్యలోటు లక్ష్యాలపై వేతన సంఘం సిఫార్సుల ప్రభావం తప్పక ఉంటుందని హెచ్చరిస్తున్నాయి. కేంద్రంపై 1.02 లక్షల కోట్ల రూపాయల భారం పడుతుందని ఫిచ్ రేటింగ్స్ చెప్పింది. అంతేగాక వచ్చే ఆర్థిక సంవత్సరం 2016-17 నాటికి ద్రవ్యలోటును 3.5 శాతానికి కట్టడి చేయాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరకపోవచ్చంది. స్టాండర్డ్ అండ్ పూర్స్ (ఎస్‌అండ్‌పి) సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఉద్యోగుల జీతాన్ని పెంచాలన్న వేతన సంఘం సిఫార్సు అమలైతే ఆర్థిక ఇబ్బందులు తప్పవంది. సిటిగ్రూప్ స్పందిస్తూ ప్రభుత్వ పెట్టుబడులను ఈ నిర్ణయం ప్రభావితం చేస్తుందంది. ఇక 47 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలతోపాటు 52 లక్షల పెన్షనర్లకు ప్రయోజనం కలిగేలా 7వ వేతన సంఘం చెప్పినట్లు 23.6 శాతం పెంచితే ప్రభుత్వ ఖజానాపై పెను భారం పడవచ్చని స్టాండర్డ్ చార్టర్డ్ ఆర్థిక నిపుణులు హెచ్చరించారు. అలాగే డిబిఎస్ స్పందిస్తూ ఇప్పటికే ఈ ఆర్థిక సంవత్సరం సగానికిపైగా ముగిసిందని, ద్రవ్యలోటు కట్టడి లక్ష్యంలో తేడా కనిపిస్తోందని చెప్పింది. 7వ వేతన సంఘం గురువారం అరుణ్ జైట్లీకి నివేదిక సమర్పించినది తెలిసిందే.