బిజినెస్

మదుపరులలో పెట్టుబడుల హుషారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 29: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 401.12 పాయింట్లు లాభపడి 24,870.69 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 138.90 పాయింట్లు అందుకుని 7,563.55 వద్ద నిలిచింది. దీంతో ఈ ఏడాది తొలిసారిగా ఈ వారం మార్కెట్లు లాభాల్లో ముగిసినట్లైంది. డాలర్‌తో పోల్చితే బలపడిన రూపాయి మారకం విలువ, బ్యాంక్ ఆఫ్ జపాన్ వడ్డీరేట్లను తగ్గించడం, ఫిబ్రవరి నెల డెరివేటివ్ కాంట్రాక్టు సిరీస్ మొదలవుతుండటం వంటివి మదుపరులను కొనుగోళ్ల దిశగా నడిపించాయి. ఈ క్రమంలోనే కన్జ్యూమర్ డ్యూరబుల్స్, హెల్త్‌కేర్, ఐటి, ఎనర్జీ, టెక్నాలజీ, క్యాపిటల్ గూడ్స్, ఆటో, మెటల్, పవర్, చమురు, గ్యాస్, ఇండస్ట్రియల్స్ రంగాల షేర్ల విలువ 3.26 శాతం నుంచి 1.31 శాతం మేర పెరిగాయి. అంతర్జాతీయంగా ఆసియా మార్కెట్లలో చైనా, జపాన్, సింగపూర్, హాంకాంగ్, తైవాన్, దక్షిణ కొరియా సూచీలు 3.09 శాతం నుంచి 0.27 శాతం మేర లాభపడ్డాయి. ఐరోపా మార్కెట్లలో ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ సూచీలూ 1.09 శాతం నుంచి 1.35 శాతం మేర పెరిగాయి.