బిజినెస్

ఎస్‌బిహెచ్ లాభం అంతంతే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 30: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్‌బిహెచ్) నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2015-16) మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో 185 కోట్ల రూపాయలుగా నమోదైంది.
గత ఆర్థిక సంవత్సరం (2014-15) అక్టోబర్-డిసెంబర్‌తో పోల్చితే ఇది 44 శాతం తక్కువ. క్రిందటిసారి 333.88 కోట్ల రూపాయల లాభాన్ని అందుకుంది. అయితే ఈసారి పెట్టుబడుల నుంచి వచ్చిన ఆదాయం క్రిందటిసారితో చూస్తే 5.26 శాతం పెరిగి 653.84 కోట్ల రూపాయల నుంచి 688 కోట్ల రూపాయలకు పెరిగిందని శనివారం ఓ ప్రకటనలో ఎస్‌బిహెచ్ తెలియజేసింది. ఇక మొత్తం ఆదాయం ఈసారి 3,950 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయినసారి 3,945 కోట్ల రూపాయలుగా ఉన్నట్లు తెలిపింది. నికర నిరర్థక ఆస్తులు 2,894 కోట్ల రూపాయలుగా, వ్యయం 3,096 కోట్ల రూపాయలుగా ఉంది. ఇదిలావుంటే గత ఏడాది ఏప్రిల్-డిసెంబర్ మధ్య బ్యాంక్ నికర లాభం 811 కోట్ల రూపాయలుగా నమోదైంది.