బిజినెస్

రాయితీలు ఆదాయ మార్గాలు కావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 30: రాయితీలకు ప్రభుత్వం వ్యతిరేకం కాదని, అయితే రాయితీలనేవి అవసరంగా భావించాలేతప్ప, వాటిని ఆదాయ మార్గాలుగా చూడకూడదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. కొన్ని రాయితీలను హేతుబద్ధం చేస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో శనివారం ఇక్కడ జరిగిన ది ఎకనామిక్ టైమ్స్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్‌లో జైట్లీ మాట్లాడుతూ పైవిధంగా స్పందించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రాబోయే వార్షిక బడ్జెట్‌లో నిర్మాణాత్మక సంస్కరణలపై దృష్టి పెట్టనున్నట్లు ఆయన చెప్పారు. వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) బిల్లు ఆమోదానికి ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ సహకరిస్తుందన్న ఆశాభావాన్ని ఈ సందర్భంగా ఆయన వ్యక్తం చేశారు.
బ్యాంకులకు పూర్తిగా సహకరిస్తాం: జయంత్ సిన్హా
ప్రభుత్వరంగ బ్యాంకుల మూలధన అవసరాలకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరిస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా శనివారం ఇక్కడ జరుగుతున్న ది ఎకనామిక్ టైమ్స్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్‌కు హాజరైన సందర్భంగా మాట్లాడుతూ స్పష్టం చేశారు. 2019 మార్చి నుంచి అమల్లోకి వచ్చే బాసెల్-3 నిబంధనలకు అనుగుణంగా బ్యాంకింగ్ మూలధనాన్ని నిలిపేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ), బ్యాంకులతో కలిసి పనిచేస్తున్నట్లు ఆయన చెప్పారు. బాసెల్-3 నిబంధనల ప్రకారం ప్రభుత్వరంగ బ్యాంకులకు 1.80 లక్షల కోట్ల నిధులు కావాల్సి ఉండగా, 70,000 కోట్ల రూపాయలను అందిస్తామని ప్రభుత్వం గతంలోనే చెప్పింది. మిగతా 1.1 లక్షల కోట్ల రూపాయలను సమకూర్చుకోవాలని సూచించినది తెలిసిందే. ప్రభుత్వం అందించే సాయం.. ఈ ఆర్థిక సంవత్సరం 25,000 కోట్ల రూపాయలు, వచ్చే రెండు ఆర్థిక సంవత్సరాల్లో 20,000 కోట్ల రూపాయలు, ఆపై ఆర్థిక సంవత్సరం 25,000 కోట్ల రూపాయలుగా ఉంటుంది.

చిత్రం...
ది ఎకనామిక్ టైమ్స్ గ్లోబల్ బిజినెస్
సమ్మిట్‌లో మాట్లాడుతున్న
కేంద్ర ఆర్థిక మంత్రి
అరుణ్ జైట్లీ