బిజినెస్

ఆర్‌బిఐ పాలసీపై ఆధారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 31: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ద్రవ్యసమీక్ష, కార్పొరేట్, ప్రభుత్వరంగ సంస్థల ఆర్థిక ఫలితాలు ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్ల సరళిని ప్రభావితం చేస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2015-16) మూడో త్రైమాసికానికి (అక్టోబర్-డిసెంబర్)గాను బజాజ్ ఆటో, టాటా స్టీల్, టెక్ మహీంద్ర, డిఎల్‌ఎఫ్, ఇండియన్ ఆయిల్, లుపిన్ తదితర సంస్థలు ఈ వారం తమ ఆర్థిక ఫలితాలను వెల్లడించనున్నాయి. అలాగే మంగళవారం ఆర్‌బిఐ ద్రవ్యసమీక్ష జరపనుంది. దీంతో మదుపరులు చూపంతా వీటిపైనే ఉందన్న అభిప్రాయాలు నిపుణుల నుంచి వ్యక్తమవుతున్నాయి. ‘ఆర్‌బిఐ ద్రవ్యసమీక్షపైనే అందరి చూపు నెలకొంది. స్థూల ఆర్థిక గణాంకాలు, ఆయా సంస్థల ఆర్థిక ఫలితాలు, అంతర్జాతీయ మార్కెట్ల తీరుతెన్నులు, డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ, గ్లోబల్ మార్కెట్‌లో ముడి చమురు ధరల ప్రభావం కూడా మదుపరుల పెట్టుబడులను ప్రభావితం చేయనున్నాయి.’ అని ట్రేడ్ స్మార్ట్ ఆన్‌లైన్ వ్యవస్థాపక డైరెక్టర్ విజయ్ సింఘానియా అన్నారు. మరోవైపు వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2016-17)గాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించే వార్షిక బడ్జెట్‌లో వివిధ రంగాల కేటాయింపులపై అంచనాలు మదుపరులలో మొదలయ్యాయని, ఆ ప్రభావం కూడా స్టాక్ మార్కెట్లపై ఉంటుందన్న అభిప్రాయం పలువురు నిపుణుల నుంచి వినిపిస్తోంది. సేవా, ఉత్పాదక రంగాలకు సంబంధించి విడుదలయ్యే పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పిఎమ్‌ఐ) గణాంకాలు కూడా మార్కెట్ కదలికలను నిర్దేశించవచ్చని చెబుతున్నారు. అయితే వివిధ సంస్థలు ప్రకటించే మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు మార్కెట్లను అధికంగా ప్రభావితం చేయవచ్చని కొటక్ సెక్యూరిటీస్ ప్రైవేట్ క్లయింట్ గ్రూప్ రిసెర్చ్ అధిపతి, సీనియర్ ఉపాధ్యక్షుడు దీపెన్ షా అన్నారు. ఇకపోతే జనవరి నెలకు సంబంధించి ఆటోరంగ సంస్థలు ప్రకటించే అమ్మకాలు, ఎగుమతుల వివరాలు సోమవారం మార్కెట్ ట్రేడింగ్‌ను శాసించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. విదేశీ మదుపరుల పెట్టుబడులపైనా మార్కెట్ లాభనష్టాలు ఆధారపడి ఉంటాయని అంటున్నారు. కాగా, గత వారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 435 పాయింట్లు, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 141 పాయింట్లు పెరిగినది తెలిసిందే.