బిజినెస్

కీలక వడ్డీరేట్లు యథాతథం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 31: ద్రవ్యోల్బణం మళ్లీ పెరుగుతున్న సంకేతాలుండటంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) మంగళవారం జరిపే ద్రవ్యసమీక్షలో కీలక వడ్డీరేట్లను యథాతథంగానే ఉంచే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మరోవైపు వచ్చే ఆర్థిక సంవత్సరం (2016-17) కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే వార్షిక బడ్జెట్ తర్వాతే వడ్డీరేట్లపై ఆర్‌బిఐ ఓ నిర్ణయం తీసుకునే వీలుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. యెస్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ రాణా కపూర్ ఈ మేరకు పిటిఐ వద్ద తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. సిటి గ్రూప్ సైతం ఓ రిసెర్చ్ నోట్‌లో రెపో, రివర్స్ రెపో వడ్డీరేట్ల జోలికి ఈసారి సమీక్షలో ఆర్‌బిఐ వెళ్లకపోవచ్చని అంచనా వేసింది.
మార్చి, ఏప్రిల్ నెలల్లో మాత్రం పావు శాతం వడ్డీరేట్లను తగ్గించవచ్చని అభిప్రాయపడింది. డిసెంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలు 5.61 శాతానికి పెరిగినది తెలిసిందే. డిబిఎస్, హెచ్‌ఎస్‌బిసి నివేదికలు సైతం ఈసారి కీలక వడ్డీరేట్లు యథాతథంగానే ఉండవచ్చని పేర్కొంది.