బిజినెస్

విన్యాసాలు చూడటం కష్టమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 1: ఈ నెల ఆరు, ఏడు తేదీల్లో విశాఖలో జరగనున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ, నేవీ విన్యాసాలు, ఇంటర్నేషనల్ సిటీ పెరేడ్‌ను వీక్షించి, ఆనందించే అవకాశం కష్టంగానే కనిపిస్తోంది. ఆర్‌కే బీచ్‌లో లక్షన్నర మంది విన్యాసాలు చూసేందుకు ఏర్పాట్లు చేసినట్టు నేవీ, రెవెన్యూ అధికారులు చెపుతున్నారు. 7న విన్యాసాలు వీక్షించేందుకు ఇప్పటికే లక్షన్నర పాస్‌లు జారీ చేశారు. ఈ పాస్‌లను కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసి లోనికి వదలాలని భద్రతా దళాలు ఆంక్షలు విధించాయి. పాస్ ఉన్న వారు వారితోపాటు విధిగా ఆధార్ కార్డును తీసుకువెళ్లాల్సి ఉంటుంది. అయితే, వీరంతా ఇసుక తినె్నలపై నిలబడే విన్యాసాలను తిలకించాల్సి ఉంటుంది. మధ్యాహ్నం రెండు గంటల నుంచి జనం బీచ్ రోడ్డులో ఏర్పాటు చేసిన 75 ఎన్‌క్లోజర్లకు చేరుకుంటారు. బీచ్ రోడ్డులో జనం నిండిపోతే, మిగిలిన వారిని నగరంలోని వివిధ ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన హోల్డింగ్ ఏరియాల్లో నిలిపివేస్తారు. వీరు ఎట్టి పరిస్థితుల్లోనూ విన్యాసాలను చూసే అవకాశం ఉండదు. వీరికోసం ఎల్‌సిడి స్క్రీన్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఇక పాస్‌లతోపాటు జనం మధ్యాహ్నం రెండు గంటల నుంచి బీచ్ రోడ్డుకు చేరుకుంటారు. విన్యాసాలు సాయంత్రం 5.20 గంటలకు ప్రారంభమవుతాయి. సిటీ పెరేడ్ రాత్రి ఎనిమిది గంటలకు ముగుస్తుంది. ఆ తరువాత ప్రధాని నరేంద్ర మోదీ నోవాటెల్ హోటల్‌లో విందు ఇస్తారు. సుమారు 9.15 గంటలకు ఆయన విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అదే సమయంలో బీచ్ రోడ్డు నుంచి జనం నగరంలోని వివిధ ప్రాంతాలకు బయల్దేరి వెళ్లాల్సి ఉంటుంది. ప్రధాని కాన్వాయ్ వెళ్లేందుకు వీలుగా హైవేను బ్లాక్ చేయనున్నారు. ఇటువంటి పరిస్థితిల్లో జనం రాత్రి 9.30 గంటల వరకూ ఆయా ప్రాంతాల్లో చిక్కుకునే అవకాశం ఉంది. ఈ సందర్భంలో తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. కాగా, బీచ్ రోడ్డు నుంచి నగరంలోకి రావడానికి కేవలం నాలుగు, ఐదు మార్గాలు మాత్రమే ఉన్నాయి. ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాలపై వచ్చే వారు తమతమ వాహనాలను కనీసం రెండు కిలో మీటర్ల దూరంలో నిలిపి వేయాల్సి ఉంటుంది. విన్యాసాలు పూర్తయిన తరువాత వీరు వాహనాల దగ్గరకు వెళ్లడానికే గంటకు పైగా సమయం పట్టే అవకాశం ఉంది. నగరంలో ట్రాఫిక్ జామ్‌లు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని జనం విన్యాసాలు చూసేందుకు రావటంపై నిర్ణయం తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు. ఇదిలా ఉండగా నగరంలో అన్ని హోటల్స్ అతిథులతో నిండిపోయాయి. కేవలం విఐపిల కోసం 700 హోటల్ గదులను సిద్ధం చేశారు. అలాగే ప్రభుత్వ అతిథి గృహాలన్నీ నిండిపోయాయి. ఫ్లీట్ రివ్యూ తిలకించేందుకు పలు ప్రాంతా నుంచి జనం విశాఖకు రావాలనుకుంటున్నారు. ఇక్కడున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని వారి బంధువులే వారిని రావద్దని చెప్పే పరిస్థితి ఏర్పడింది.
4వ తేదీన రిహార్సల్స్ చూడ్డం మేలు!
ఏడవ తేదీన జరిగే విన్యాసాలను తిలకించేకన్నా, నాలుగు తేదీన జరిగే రిహార్సల్స్ చూడ్డం మేలని అధికారులు చెపుతున్నారు. ఆరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం పలు దశల్లో రిహార్సల్స్ జరగనున్నాయి. వీటితో సరిపెట్టుకుంటే మంచిందని అధికారులు చెపుతున్నారు. 7న జరిగే విన్యాసాలన్నింటినీ రిహార్సల్స్‌లోనూ ప్రదర్శిస్తారు.

అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ సందర్భంగా కాంతులీనుతున్న విశాఖ విమానాశ్రయం