బిజినెస్

క్షణాల్లో నో స్టాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: చైనాకు చెందిన ఎలక్ట్రానిక్స్ సంస్థ లీఇకో మంగళవారం ఈ-కామర్స్ పోర్టల్ ఫ్లిప్‌కార్ట్‌పై నిర్వహించిన 4జి లీ 1ఎస్ స్మార్ట్ఫోన్ల అమ్మకాలకు విశేష స్పందన లభించింది. ప్రారంభించిన కేవలం రెండు సెకన్లలోనే 70 వేలకుపైగా అమ్ముడైపోయాయి. ‘లీ 1ఎస్‌కు లభించిన స్పందన అత్యద్భుతం. 70,000 యూనిట్లను అమ్మకానికి పెట్టాం. అమ్మకాలు మొదలైన కేవలం రెండు సెకన్లలోనే మొత్తం స్టాక్ అమ్ముడైపోయింది.’ అని లీ ఎకోసిస్టమ్ టెక్నాలజీ ఇండియా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అతుల్ జైన్ పిటిఐకి తెలిపారు. కాగా, లీ 1ఎస్‌ను దక్కించుకునేందుకు దాదాపు 6.05 లక్షల మంది ఈ సేల్‌లో పోటీపడ్డారు. ఫ్లిప్‌కార్ట్‌లో ఏ బ్రాండ్ ఉత్పత్తికి సంబంధించిన అమ్మకాల్లోనైనా ఈ స్థాయిలో పోటీ ఇప్పటిదాకా లేకపోవడం గమనార్హం. ఈ మేరకు ఫ్లిప్‌కార్ట్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అంకిత్ నగోరి తెలిపారు. లీ 1ఎస్ కోసం వచ్చిన రిజిస్ట్రేషన్లు.. గత రికార్డులను మించిపోయాయన్నారు. మరోవైపు మంగళవారం సేల్‌లో లీ 1ఎస్‌కు వచ్చిన విశేష స్పందన నేపథ్యంలో ఈ నెల 9న మరోసారి సేల్ నిర్వహించనున్నట్లు అతుల్ జైన్ ప్రకటించారు. తాజా సేల్‌లో తమ 4జి స్మార్ట్ఫోన్‌ను దక్కించుకోలేకపోయినవారు అప్పుడు కొనవచ్చన్నారు. ఇకపోతే ఈ సేల్ స్పందనను చూస్తే ఈ ఏడాది ఆఖరుకల్లా భారతీయ స్మార్ట్ఫోన్ మార్కెట్‌లో తాము మూడో స్థానంలో ఉంటామన్న విశ్వాసం కలుగుతోందని జైన్ ఈ సందర్భంగా అన్నారు. ఇదిలావుంటే లీ 1ఎస్ ఫీచర్ల విషయానికొస్తే 5.5 అంగుళాల ఫుల్ హై డెఫినిషన్ డిస్‌ప్లే, 64-బిట్ యాక్టా-కోర్ ప్రాసెసర్, 3జిబి ర్యామ్, 32జిబి ఇంటర్నల్ స్టోరేజ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా దీని సొంతం. కేవలం 5 నిమిషాలు చార్జింగ్ చేస్తే, 3:30 గంటలు మాట్లాడుకోవచ్చని జైన్ చెప్పారు. దీని ధర ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో 10,999 రూపాయలుగా ఉండగా, ఇవే ఫీచర్లు కలిగిన ఇతర సంస్థల స్మార్ట్ఫోన్ల ధర కనీసం 16,000 రూపాయల పైనేనన్నారు.