బిజినెస్

రాజమండ్రిలో కోకో పార్క్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 2: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సమీపాన వి2సి గ్రూప్ త్వరలో ‘ఇంటిగ్రేటెడ్ కోకో పార్కు’ నెలకొల్పనున్నది. వి2సి సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరక్టర్ డివి రామ్‌కుమార్ నేతృత్వంలో ప్రతినిధి బృందం మంగళవారం విజయవాడలోని సిఎంఓలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుతో భేటీ అయి చర్చించింది. 250 కోట్ల రూపాయల నుంచి 300 కోట్ల రూపాయల వ్యయం కాగల కోకో పార్కులో ప్రధాన పరిశ్రమ (యాంకర్ ఇండస్ట్రీ)ని వి2సి గ్రూప్ నెలకొల్పుతుంది. పార్కులో అనుబంధంగా ఏర్పాటయ్యే పరిశ్రమల పెట్టుబడి మరో 300 కోట్ల రూపాయల నుంచి 350 కోట్ల రూపాయలుగా ఉంటుందని అంచనా. ప్రస్తుతం గోదావరి జిల్లాల్లో 40 శాతం కొబ్బరి చెట్లకు 60 ఏళ్లు దాటుతున్నాయని సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు. మరో పదేళ్లకు పంట దాదాపు అంతరించిపోయే పరిస్థితి వస్తుందని కొన్ని పరిశోధనల్లో తేలిందంటూ వారు సిఎంకు వివరించారు. ఇప్పటికే కొబ్బరిపంట దిగుబడి తరుగుదల కన్పిస్తోందని ప్రతినిధులు గుర్తుచేశారు. కాగా, పూర్తిస్థాయి పంట దిగుబడి మెరుగుపరిచే అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని తాము ఉపయోగిస్తున్నామన్నారు. కోకో పార్కు ఏర్పాటు వల్ల కంపెనీలు పంటను వెనువెంటనే కొనుగోలు చేసి అక్కడికక్కడే డబ్బు చెల్లిస్తాయని చెప్పారు. కోకో పార్కు ఏర్పాటులో ఉద్దేశం ‘ఎండ్ టు ఎండ్ కానె్సప్ట్’ అని, అంటే కొబ్బరి పంట ఉత్పత్తి నుంచి దిగుబడి దాకా, కొబ్బరి కాయలో ప్రతి పదార్థాన్ని వినియోగంలోకి తీసుకొచ్చి పంటను రైతుకు లాభసాటిగా మారుస్తామని వారు ముఖ్యమంత్రికి వివరించారు. కోకో పార్కు ప్రధాన పరిశ్రమతోపాటు అనుబంధంగా మరో 15 పరిశ్రమలు వస్తాయని, కొబ్బరి పంట ఉత్పత్తికిగాను రైతులకు అదనపు ఆదాయాన్ని ఆర్జించి పెట్టడం కోకో పార్కు ఏర్పాటు ప్రధాన ధ్యేయమన్నారు. కొబ్బరి పంట మార్కెటింగ్ జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌కు అనుసంధానం జరుగుతుందని, ముడి కొబ్బరి పంట, కొబ్బరి నుంచి టెంకాయ, పీచు, ఇలా ప్రతి పదార్థాన్ని వినియోగంలోకి తెస్తామని వి2సి ప్రతినిధులు అన్నారు. అయతే పంట అభివృద్ధికి ప్రపంచంలో బెస్ట్ ప్రాక్టీసెస్‌ను తీసుకొచ్చి ఇక్కడ ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. అందుకు స్పందిస్తూ ప్రతినిధి బృందం నేత, వి2సి గ్రూప్ చైర్మన్, సిఎండి డివి రామ్‌కుమార్ తాము ప్రపంచస్థాయి సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకొచ్చి కొబ్బరి రైతుల జీవన స్థితిగతులను మెరుగుపరుస్తామన్నారు. కోకో పార్కు ఆధ్వర్యంలో తాము 10 వేల మంది యువ రైతుల్ని ఎంపిక చేసి ఆధునిక పరిజ్ఞానం ఉపయోగించటంలో సుశిక్షితులుగా తీర్చిదిద్దుతామని, ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా మారుస్తామని ప్రతినిధులు వివరించారు. 3 వేల మంది కొబ్బరి రైతులతో ఒక గ్రూప్ చొప్పున ఏర్పాటు చేస్తామన్నారు. దీనివల్ల వారు కొబ్బరి దిగుబడిలో పరిజ్ఞానం పెంచుకుంటారని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.