బిజినెస్

రియల్టీలో బెంగళూరు భేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: నిర్మాణ రంగంలో వాణిజ్యపరమైన వృద్ధి బెంగళూరులో అత్యధికంగా ఉందని ప్రాపర్టీ కన్సల్టెంట్ జెఎల్‌ఎల్ తెలిపింది. ఈ విషయంలో ఆసియా-పసిఫిక్ దేశాల్లో బెంగళూరు మొదటి స్థానంలో నిలిచిందని, ప్రపంచ దేశాల్లో నాలుగో స్థానంలో ఉందని మంగళవారం ఓ ప్రకటనలో జెఎల్‌ఎల్ ఇండియా వెల్లడించింది. మొదటి మూడు స్థానాల్లో లండన్, సిలికాన్ వ్యాలీ, డబ్లిన్ ఉన్నాయని పేర్కొంది. హైదరాబాద్ మాత్రం 17వ స్థానంలో ఉందని చెప్పింది. కాగా, ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో టాప్-10లో రెండో స్థానంలో షాంగై ఉండగా, ఆ తర్వాత వరుసగా సిడ్నీ, బీజింగ్, షెనె్జన్, టోక్యో, నంజింగ్, హైదరాబాద్, మెల్‌బోర్న్, సియోల్ ఉన్నాయి. హైదరాబాద్ 8వ స్థానంలో ఉంది.
హోల్‌సేల్ మార్కెట్‌లో
భారీగా పతనమైన ఉల్లి ధరలు
కిలో రూ. 10 దిగువనే
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: నిన్నమొన్నటిదాకా రికార్డు స్థాయిలో పలికిన ఉల్లిగడ్డ ధరలు ఇప్పుడు నేలచూపు చూస్తున్నాయి. హోల్‌సేల్ మార్కెట్‌లో కిలో ధర 10 రూపాయల దిగువకు చేరింది. ఆసియాలోనే ఉల్లిగడ్డ అమ్మకాలకు ప్రసిద్ధిగాంచిన మహారాష్టల్రోని లాసల్గావ్ హోల్‌సేల్ మార్కెట్‌లో కిలో ధర ప్రస్తుతం 9.50 రూపాయలు పలుకుతోంది.
ఈ ఆర్థిక సంవత్సరం (2015-16)లోనే ఇది అత్యంత కనిష్ట స్థాయి కావడం గమనార్హం. గత ఏడాది సెప్టెంబర్‌లో కిలో ధర 41.30 రూపాయలుండగా, అదే ఇప్పటిదాకా కనిష్టం. కాగా, హోల్‌సేల్ ఉల్లిగడ్డ ధరలు కిలో 7 రూపాయల నుంచి 14.22 రూపాయల మధ్య కదలాడుతున్నాయని నేషనల్ హార్టికల్చరల్ అండ్ రిసెర్చ్ ఫౌండేషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌డిఎఫ్) తెలిపింది. గత ఏడాది ఆగస్టులో కిలో ధర హోల్‌సేల్ మార్కెట్‌లో 80 రూపాయల వరకు వెళ్లినది తెలిసిందే.

ఎన్‌సిఎల్ మధ్యంతర డివిడెండ్ రూ. 2,644 కోట్లు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: బొగ్గు తవ్వకాల్లో ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థ కోల్ ఇండియా లిమిటెడ్‌కు అనుబంధంగా పనిచేస్తున్న నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎన్‌సిఎల్) ప్రభుత్వానికి 2,644 కోట్ల రూపాయల మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. వెయ్యి రూపాయల విలువైన 17,76,728 ఈక్విటీ షేర్లకు ఒక్కోదానికి 14,884.05 చొప్పున 2,644.49 కోట్ల రూపాయల మధ్యంతర డివిడెండ్‌ను డిసెంబర్ 31తో ముగిసిన కాలానికి ప్రకటించినట్లు మంగళవారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు కోల్ ఇండియా తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరం ఇది రెండో డివిడెండని చెప్పింది.

బజాజ్ ఆటో అమ్మకాల్లో స్వల్ప వృద్ధి
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: దేశీయ ఆటోరంగ సంస్థ బజాజ్ ఆటో అమ్మకాలు గత నెల జనవరిలో 1.78 శాతం పెరిగి 2,93,939 యూనిట్లుగా నమోదయ్యాయి. గత ఏడాది జనవరిలో 2,88,746 యూనిట్లను బజాజ్ అమ్మింది. కాగా, గతంతో పోల్చితే ఈసారి మోటార్‌సైకిళ్ల అమ్మకాలు 2.44 శాతం వృద్ధితో 2,52,988 యూనిట్లుగా ఉంటే, వాణిజ్య వాహన అమ్మకాలు మాత్రం 41,791 యూనిట్ల నుంచి 40,951 యూనిట్లకు పడిపోయాయి. ఇక ఎగుమతులు ఈ జనవరిలో 1,32,069 యూనిట్లుగా, క్రిందటిసారి 1,42,992 యూనిట్లుగా ఉన్నట్లు మంగళవారం స్పష్టం చేసింది.