బిజినెస్

గ్రామీణ ప్రాంతాల్లో కొనుగోలు శక్తి పెరగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: గడచిన రెండేళ్లుగా వర్షాభావ పరిస్థితుల కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో కొనుగోలు శక్తి క్షీణించిందని, మళ్లీ అది పుంజుకుంటేనే వృద్ధిరేటు పరుగులు పెడుతుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. మంగళవారం ఇక్కడ జరిగిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2016 సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం భారత జిడిపి వృద్ధిరేటు 7-7.5 శాతం మధ్య నమోదయ్యే వీలుందని, ఇది మరింతగా పెరగాలంటే గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయోత్పత్తి వృద్ధిపథంలో ఉండాలన్నారు. అప్పుడే అన్ని రకాల ఉత్పత్తుల అమ్మకాలు పెరుగుతాయని, తద్వారా పెట్టుబడులు కూడా పుంజుకుంటాయని తెలిపారు. ప్రభుత్వపరంగాను ఇందుకు కావాల్సిన చర్యలను చేపడతామన్నారు. నిజానికి అంతర్జాతీయంగానే మందగమన పరిస్థితులు ఏర్పడ్డాయని, ఇంతకుముందు భారత ఆర్థిక వ్యవస్థతో పోల్చిన దక్షిణాఫ్రికా, బ్రెజిల్, రష్యా తదితర దేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ ఇప్పుడు మందగమనంలో పయనిస్తున్నాయన్నారు. అయితే నెమ్మదిగా పుంజుకుంటున్న సంకేతాలు కొద్దికొద్దిగా కనిపిస్తున్నాయన్నారు. ముఖ్యంగా చైనా ఆర్థిక వ్యవస్థ మందగమనం ప్రపంచ దేశాలన్నింటిపైనా పడిందని చెప్పారు. అమెరికా కూడా పూర్తిస్థాయిలో ఆర్థిక ప్రగతిని ప్రదర్శించలేకపోతోందన్నారు.

సమ్మేళనంలో మాట్లాడుతున్న అరుణ్ జైట్లీ