బిజినెస్

మార్కెట్‌కు ఆర్‌బిఐ దెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 2: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. తాజా ద్రవ్యసమీక్షలో కీలక వడ్డీరేట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) యథాతథంగా ఉంచడం మదుపరులకు రుచించలేదు. ఫలితంగా అమ్మకాలకు దిగగా, బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 285.83 పాయింట్లు పతనమై 24,539 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ సైతం 100.40 పాయింట్లు క్షీణించి 7,455.55 వద్ద స్థిరపడింది. మెటల్, ఎనర్జీ, చమురు, గ్యాస్, హెల్త్‌కేర్, విద్యుత్, యుటిలిటీస్, ఇండస్ట్రియల్స్, రియల్టీ, బ్యాంకింగ్ రంగాల షేర్ల విలువ 4.33 శాతం నుంచి 1.68 శాతం మేర పడిపోయింది. టెలికామ్ రంగ షేర్ల విలువ మాత్రం 0.41 శాతం పెరిగింది. అంతర్జాతీయంగా ఆసియా మార్కెట్లలో హాంకాంగ్, జపాన్, సింగపూర్, దక్షిణ కొరియా, తైవాన్ సూచీలు 0.32 శాతం నుంచి 0.89 శాతం క్షీణించాయి. చైనా సూచీ మాత్రం 2.26 శాతం పుంజుకుంది. ఐరోపా మార్కెట్లలో ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ సూచీలు 1.32 శాతం నుంచి 1.63 శాతం వరకు దిగజారాయి.