బిజినెస్

చైనాను అధిగమిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: ఉత్పాదక, వ్యవసాయ రంగాల్లో మెరుగైన పరిస్థితుల మధ్య ఈ ఆర్థిక సంవత్సరం (2015-16) భారత జిడిపి వృద్ధిరేటు ఐదేళ్ల గరిష్ఠాన్ని తాకుతూ 7.6 శాతంగా నమోదు కావచ్చని సోమవారం కేంద్ర గణాంకాల కార్యాలయం (సిఎస్‌ఒ) అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరం (2014-15)లో దేశ జిడిపి వృద్ధిరేటు 7.2 శాతంగా నమోదైందన్న సిఎస్‌ఒ.. 2010-11 ఆర్థిక సంవత్సరంలో 8.9 శాతం వృద్ధిరేటు నమోదైందని, ఆ తర్వాత ప్రస్తుత ఆర్థిక సంవత్సరమే అధికంగా నమోదు కానుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే ఆర్థిక మందగమనంలో ఉన్న చైనాను భారత్ అధిగమించనుందని పేర్కొంది. 2015లో చైనా జిడిపి వృద్ధి 6.9 శాతంగానే ఉందని గుర్తుచేసిన సిఎస్‌ఒ.. బ్రెజిల్ వృద్ధిరేటు అంచనా 3.7 శాతానికి పడిపోయిందని తెలిపింది. ఇదిలావుంటే ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో భారత జిడిపి వృద్ధి మందగించింది. గత త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)లో సవరించిన 7.7 శాతంతో పోల్చితే తగ్గగా, ఈసారి 7.3 శాతానికే పరిమితమైంది. అయితే గత ఆర్థిక సంవత్సరం అక్టోబర్-డిసెంబర్‌తో పోల్చితే మాత్రం పెరిగింది. నాడు 6.6 శాతంగా ఉంది. మరోవైపు ఈ ఆర్థిక సంవత్సరంలో భారత జిడిపి వృద్ధిరేటు 7.6 శాతంగా ఉంటుందంటూ సిఎస్‌ఒ వేసిన అంచనా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ), అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎమ్‌ఎఫ్), ప్రపంచ బ్యాంక్ ఇతర దేశ, విదేశీ ఆర్థిక, రేటింగ్ ఏజెన్సీల అంచనాలను మించి ఉండటం గమనార్హం. ఆర్థిక మంత్రిత్వ శాఖ అంచనా 7-7.5 శాతంగా ఉంటే, ఆర్‌బిఐది 7.4 శాతం, ఐఎమ్‌ఎఫ్ 7.3 శాతం, ఆసియా అభివృద్ధి బ్యాంక్ 7.4 శాతం, మూడీస్ 7 శాతంగా ఉన్నాయి.
తలసరి ఆదాయంపై..
తలసరి ఆదాయం కూడా ఈ ఆర్థిక సంవత్సరంలో 6.2 శాతం పెరిగి నెలకు 6,452.58 రూపాయలుగా ఉంటుందని సిఎస్‌ఒ అంచనా వేసింది. 2015-16 మొత్తంగా 77,431 రూపాయలుగా ఉండొచ్చని, గత ఆర్థిక సంవత్సరం 2014-15లో ఇది 72,889 రూపాయలుగా ఉందని సోమవారం విడుదల చేసిన గణాంకాల ద్వారా సిఎస్‌ఒ చెప్పింది.

ఎవరేమన్నారు?

‘ఈ గణాంకాలు చాలా ఆశాజనకంగా ఉన్నాయి. గత ఏడాదిన్నర కాలం నుంచి కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు, తీసుకున్న విధాన నిర్ణయాలకు అద్దం పడుతున్నాయి.’
-ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్
‘్భరత ఆర్థిక వ్యవస్థ పుంజుకుందన్న సంకేతాలను తాజా గణాంకాలిచ్చాయి. మున్ముందు మరింతగా వృద్ధిరేటు పరుగులు పెట్టాలి. రాబోయే నూతన వార్షిక బడ్జెట్ సంస్కరణలతో మిళితమై ఉంటుందని భావిస్తున్నాం.’
-పారిశ్రామిక సంఘం సిఐఐ
‘కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంస్కరణలతో మున్ముందు కూడా భారత జిడిపి వృద్ధిపథంలో దూసుకెళ్తుందని అనుకుంటున్నాం. రాబోయే వార్షిక బడ్జెట్ దేశ ఆర్థిక వ్యవస్థను మరింత పురోగమింపజేస్తుందని విశ్వసిస్తున్నాం. దేశంలో పెట్టుబడులకు అనువైన వాతావరణాన్ని ప్రభుత్వం కల్పిస్తుందని భావిస్తున్నాం.’
-్ఫక్కీ ప్రధాన కార్యదర్శి ఎ దిదార్ సింగ్
‘రాబోయే బడ్జెట్‌లో ప్రభుత్వం మరిన్ని వృద్ధికారక ప్రతిపాదనలు చేయాలి. ప్రధానంగా వ్యవసాయం, వౌలిక సదుపాయాల కల్పన, ఉక్కు, బ్యాంకింగ్, ఆర్థిక రంగాల ప్రగతికి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.’
-అసోచామ్ అధ్యక్షుడు సునీల్ కనోరియా
‘ప్రపంచ ఆర్థిక మందగమనం మధ్య భారత జిడిపి వృద్ధిరేటు అంచనా కొత్త ఆశలను చిగురింపజేస్తోంది. భవిష్యత్తులో దేశ జిడిపి మరింత దూసుకెళ్లే అవకాశాలు విస్తృతంగా కనిపిస్తున్నాయి.’
-పారిశ్రామిక సంఘం పిహెచ్‌డిసిసిఐ
‘అంతర్జాతీయంగా ప్రస్తుతం ఆర్థిక మందగమన పరిస్థితులు నెలకొన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ తీరు ఆశాజనకంగా కనిపిస్తోంది. ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలను కొనసాగిస్తే, దేశ ఆర్థిక వ్యవస్థ మరింత ముందుకెళ్తుంది.’
-ఆర్థిక నిపుణులు