బిజినెస్

కుదేలైన రియల్ ఎస్టేట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు: నవ్యాంధ్ర నిర్మాణ రంగంలో ప్రగతి కొన్ని ప్రాంతాలకే పరిమితమ వుతోంది. అదికూడా రెండు మూడు జిల్లాల్లో కాస్త అభివృద్ధి చెందినట్లు కనిపిస్తోంది. ముఖ్యం గా ప్రకాశం జిల్లాలో రియల్ ఎస్టేట్ కుదేలయ్యింది. జిల్లాలోని ఎక్కువ శాతం మంది రియల్టర్లు బ్యాంకులు, వడ్డీ వ్యాపారుల దగ్గర తెచ్చిన నగదును చెల్లించలేక పలాయనం చిత్తగించిన పరిస్థితులు నెలకొన్నాయి.
రాజధాని గుంటూరు జిల్లాకు దగ్గర ప్రాంతాల్లోనే రియల్ బూమ్ లేదని, ఇక మారుమూల ప్రాంతాల్లోని భూములకు ధరలు ఎక్కడ నుండి వస్తాయని కొంతమంది రియల్టర్లు వాపోతుండటం పరిస్థితికి అద్దం పడుతోంది. గతంలో రియల్ ఎస్టేట్ మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్థిల్లింది. కాని మారిన పరిస్థితుల నేపథ్యంలో రియల్ ఎస్టేట్ పరిస్థితి మరింత దారుణంగా తయారైందనే చెప్పవచ్చు. ప్రకాశం జిల్లాలోని దొనకొండలో రాజధాని వస్తుందన్న ప్రచారం ముమ్మరం కావటంతో రియల్టర్లు ఎవరి స్థాయిలో వారు భూములను ఇబ్బడిముబ్బడిగా కొనుగోలు చేశారు. కొంతమంది అధిక వడ్డీలకు తీసుకువచ్చిమరి భూములను కొనుగోలు చేశారు. తీరా రాజధానిని గుంటూరు జిల్లా అమరావతిగా నిర్ధారించడంతో ఈ ప్రాంతంలో భూములు కొనుగోలుచేసిన రియల్టర్లు ఆర్థికంగా కుంగిపోయారు. కొంతమంది రియల్టర్లైతే దివాలాతీసే పరిస్థితిలో ఉన్నారు.
మార్టూరు, యద్దనపూడి, అద్దంకి ప్రాంతాల్లోనూ భూములకు ధరలు పలకడం లేదు. గతంలో రియల్‌ఎస్టేట్ బాగున్న సమయంలో జిల్లాలోని హైవే ప్రాంతంలో ఎకరా కోటి రూపాయలకు పైగానే పలికింది. కానీ ప్రస్తుతం 25 లక్షల రూపాయలకు కూడా కొనుగోలుచేసే నాథుడే లేక రియల్టర్లు గగ్గోలు పెడుతున్నారు. జిల్లాలోని కనిగిరి ప్రాంతంలో నిమ్జ్, దొనకొండలో పారిశ్రామిక హాబ్ వస్తుందని ముమ్మర ప్రచారం సాగుతున్నప్పటికీ ఆ ప్రాంతాల్లో భూములను కొనుగోలు చేసేందుకు రియల్టర్లు ముందుకురాని దుస్థితి.
జిల్లా కేంద్రమైన ఒంగోలులోని అపార్ట్‌మెంట్ల ధరలు గతంలో 40 లక్షల రూపాయల వరకు వెళ్లాయ. ప్రస్తుతం సీన్ రివర్స్ అయ్యంది. ఒక్కొక్క అపార్ట్‌మెంటులోని ఫ్లాట్ ధర ఇప్పుడు 25 లక్షల రూపాయల వరకు మాత్రమే పలుకుతున్నాయ. ఒంగోలు నగరంలో లెక్కకు మించి అపార్ట్‌మెంట్లు ఉండటంతో ప్రజలు ధరల విషయంలో వేచిచూసే ధోరణిని అవలంభిస్తుండటం కూడా రియల్ ఎస్టేట్ రంగాన్ని దెబ్బ తీస్తోంది.
ఇదిలాఉండగా కోస్తా తీరప్రాంతంలో కొత్తపట్నం, చీరాల, వేటపాలెం, చినగంజాం తదితర ప్రాంతాల్లో గతంలో ఎకరా 30 లక్షల రూపాయల నుండి 70 లక్షల రూపాయల వరకు పలికింది. అప్పుడు కొనుగోలు చేసిన రియల్టర్లు ఇప్పుడు ఆ భూములు అమ్ముడుగాక పీకల్లోతు అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నారు. ముఖ్యంగా కొత్తపట్నం బీచ్‌లోని భూములకు ధరలు రాని పరిస్ధితి నెలకొంది. గతంలో కోస్తా కారిడార్ వస్తుందన్న ప్రచారం జరగగా, కొత్తపట్నం బీచ్ వద్ద విశ్రాంతి తీసుకునేందుకు డాక్టర్లు, కొంతమంది పారిశ్రామికవేత్తలు భూములను కొనుగోలు చేసి భవనాలను నిర్మించారు. అయతే సునామిల ప్రభావం ఉందన్న సంకేతాలతో నేడు ఇక్కడ భూములను కొనుగోలుచేసేందుకు ఎవేరూ ముందుకురావడం లేదు. మొత్తంమీద జిల్లావ్యాప్తంగా రియల్ ఎస్టేట్ భారీగా పతనం కావటంతో రియల్టర్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అయతే గతంలో రియల్ ఎస్టేట్ రంగంలో సంపాదించిన నగదుతో కొంతమంది గుంటూరు జిల్లా అమరావతిలో భూములను కొనుగోలు చేసినట్లు సమాచారం. కాని అక్కడ కూడా ఊహించని విధంగా భూముల రేట్లు పలకకపోవటంతో వారూ ప్రస్తుతం తీవ్ర నిరాశలో మునిగిపోయారు.