బిజినెస్

అన్ని రేవుల్లో సౌర విద్యుత్ ప్లాంట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: దేశంలోని ఎనిమిది ప్రధాన రేవుల్లో 2020 సంవత్సరం నాటికి 135 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్లను నెలకొల్పుతున్నట్లు మారిటైం డైరెక్టర్, కేంద్ర నౌకయాన శాఖ కార్యదర్శి దేవంద్ర కె రాయ్ తెలిపారు. గురువారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ పరదీప్, విశాఖఫట్నం, కోల్‌కొత్తా, న్యూ మంగళూరు, కాండ్లా, కామరాజర్ తదితర రేవుల్లో ఈ సదుపాయాన్ని కల్పించేందుకు నిధులు విడుదల చేశామన్నారు. మారిటైం విధి విధానాల ఖరారు, దేశంలో నౌకాయాన రంగం అభివృద్ధిపై మెకెన్సీ సంస్ధ సర్వే జరిపి నివేదిక ఇచ్చిందన్నారు. ఈ నివేదికను తమ సంస్ధ అధ్యయనం చేస్తోందన్నారు. దేశంలో మారిటైం సంస్ధ అభివృద్ధికి ఈ నివేదిక ఉపయోగపడుతుందన్నారు. దేశంలో 78 లైట్ హౌసస్‌ను అభివృద్ధి చేస్తున్నామన్నారు. మర్మగోవా, చెన్నై, ముంబాయి, కొచ్చిన్ తదితర రేవులను టూరిస్టు హబ్‌లుగా తీర్చిదిద్దుతామన్నారు. రాష్ట్రంలో నాలుగు రేవులను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికను ఖరారు చేసినట్లు ఆంధ్ర పోర్టుల డైరెక్టర్ వి రవికుమార్ తెలిపారు. విశాఖపట్నం పోర్టు చైర్మన్ టి.కృష్ణబాబు మాట్లాడుతూ, వచ్చే నెల నుంచి విశాఖ పోర్టు మొత్తం సౌర విద్యుత్ ప్లాంట్‌పై నడుస్తుందన్నారు. వచ్చే నెల 20వ తేదీ నాటికి విశాఖ పోర్టులో సౌర విద్యుత్ ప్లాంట్ సామర్ధ్యం 8 మెగావాట్లకు చేరుకుంటుందన్నారు. ఇప్పటికే రెండు మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశామన్నారు. దేశం మొత్తం మీద ఒక రేవుసౌర విద్యుత్‌పై ఆధారపడి పనిచేయడం విశాఖపట్నం పోర్టుతో ప్రారంభమవుతుందన్నారు.

ఢిల్లీలో అఖిల భారత
సఫాయి మజ్దూర్ కాంగ్రెస్
ఆంధ్రభూమి ప్రతినిధి
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: బొగ్గు పరిశ్రమకు అనుబంధంగా పనిచేస్తున్న కాంట్రాక్టు పారశుద్ధ్య కార్మికుల డిమాండ్ల్ సాధనకై అఖిల భారత సఫాయి మజ్దూర్ కాంగ్రెస్ యూనియన్ సమావేశం ఢిల్లీలో జరిగింది. కాంట్రాక్టు స్వీపర్లకు ఒకటో కేటాగిరి వేతనాలు ఇవ్వాలని, అలాగే పద్ధెనిమిది ప్రధాన డిమాండ్లతో పాటు అనుబంధ కోర్కెలను నెరవేర్చాల్సిందిగా ప్రధాని మోదీకి వినతి ప్రతం సమర్పించామని యూనియన్ నాయకులు తెలిపారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన భూపతి అప్పారావు, జి.శ్రీనివాస్‌రావు తదితరులు పాల్గొన్నారు.