బిజినెస్

ఐటి రంగానికి వర్షం దెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, డిసెంబర్ 2: తమిళనాడులో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు దేశంలోని ప్రముఖ ఐటి హబ్‌లలో ఒకటైన చెన్నైని ముంచెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడి ఐటి సంస్థల కార్యకలాపాలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నామని, కీలక సేవలకు ఎటువంటి అంతరాయం కలగడం లేదని ఐటి సంస్థలు చెబుతున్నప్పటికీ, కుండపోతతో వీధులన్నీ జలమయంగా మారడంతో ఐటి కార్యాలయాలకు యాజమాన్యాలు సెలవులిస్తున్నాయి. ఇన్ఫోసిస్ బుధ, గురువారాలను సెలవు దినాలుగా ప్రకటించింది.
కార్యాలయాల్లోని సిబ్బంది ఇళ్ళలోకి చేరేందుకు నానా తంటాలు పడాల్సి వస్తోంది. ఇక చెన్నైలో 11 కార్యాలయాలను, 60,000 మంది ఉద్యోగులను కలిగి ఉన్న కాగ్నిజెంట్.. ముఖ్యమైన సేవల కోసం కొందరు సిబ్బందిని ఇంటికి వెళ్ళనివ్వకుండా కార్యాలయాల వద్దే ఉంచింది. మరికొందరిని ఇతర ప్రాంతాలకు చేర్చి అక్కడ పని చేయిస్తోంది. టిసిఎస్ సైతం సాధారణ కార్యకలాపాలకు విరామమిచ్చి, ముఖ్యమైన సేవలను మాత్రమే కొనసాగిస్తోంది.
టెలికాం సంస్థల ఉచిత టాక్‌టైమ్ ఆఫర్లు
కుంభవృష్టి నేపథ్యంలో బిఎస్‌ఎన్‌ఎల్, ఎయిర్‌టెల్, వొడాఫోన్, రిలయన్స్ కమ్యూనికేషన్స్, ఎయిర్‌సెల్ సంస్థలు చెన్నైలో తమ కస్టమర్లకు ఉచిత టాక్‌టైమ్ ఆఫర్లను ప్రకటించాయి.
వర్షాలతో విద్యుత్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో కొన్ని ప్రాంతాల్లో ఎయిర్‌టెల్ సేవలను ప్రభావితం చేసింది.
బీమా క్లెయిమ్‌ల పనిలో ఇన్సూరెన్స్ సంస్థలు
శతాబ్ద కాలంలో ఎన్నడూ లేనివిధంగా చెన్నైని వర్షాలు ముంచెత్తుతున్న నేపథ్యంలో ఇప్పటిదాకా వచ్చిన 600 కోట్ల రూపాయలకుపైగా క్లెయిమ్‌లను సెటిల్ చేసే పనిలో నిమగ్నమయ్యాయి ఇన్సూరెన్స్ సంస్థలు. ఈ వరదలు తమపై 100 కోట్ల రూపాయల అదనపు భారాన్ని మోపుతాయని బీమా సంస్థలు అంచనా వేస్తున్నాయి.

చిత్రం... భారీ వర్షాలతో చెన్నైలోని ఇన్ఫోసిస్ కార్యాలయంలోకి చేరిన వరద నీరు