బిజినెస్

ఆఖర్లో కొనుగోళ్ల మద్దతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. ట్రేడింగ్ చివర్లో నమోదైన కొనుగోళ్లతో తిరిగి లాభాలను అందుకోగలిగాయి. మంగళవారం సూచీలు భారీ నష్టాలపాలైనది తెలిసిందే. ఈ క్రమంలో అంతర్జాతీయ మార్కెట్‌లో కోలుకున్న ముడి చమురు ధరలు, తద్వారా పుంజుకున్న ఐరోపా మార్కెట్లు.. దేశీయంగా మదుపరులను ఉత్సాహపరిచాయి. దీంతో బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 189.90 పాయింట్లు పెరిగి 23,381.87 వద్ద స్థిరపడితే, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 60.20 పాయింట్లు కోలుకుని 7,108.45 వద్ద నిలిచింది. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ 30 నెలల కనిష్టానికి దిగజారి 68.47 వద్దకు చేరినప్పటికీ మదుపరులు పెట్టుబడులకే ఆసక్తి కనబరిచారు. నిజానికి బుధవారం సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఉదయం సెనె్సక్స్ 23,434.91 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకితే, ఆ తర్వాత 22,920.84 పాయింట్ల కనిష్ట స్థాయినీ చేరింది. కానీ మళ్లీ మదుపరుల కొనుగోళ్ల జోరుతో పరుగులు పెట్టింది. ఇక హెల్త్‌కేర్, ఇంధనం, చమురు, గ్యాస్, ఇండస్ట్రియల్స్, ఆటో, క్యాపిటల్ గూడ్స్, ఐటి, టెక్నాలజీ రంగాల షేర్ల విలువ 1.57 శాతం నుంచి 0.87 శాతం పెరిగింది. అయితే కన్జ్యూమర్ డ్యూరబుల్స్, బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల షేర్ల విలువ 2.34 శాతం నుంచి 0.07 శాతం వరకు తగ్గింది. బిఎస్‌ఇ మిడ్-క్యాప్ 0.21 శాతం, స్మాల్-క్యాప్ 0.47 శాతం చొప్పున పెరిగాయి. అంతర్జాతీయంగా ఆసియా మార్కెట్లలో హాంకాంగ్, జపాన్, సింగపూర్, దక్షిణ కొరియా సూచీలు 0.23 శాతం నుంచి 1.36 శాతం నష్టపోతే, చైనా, తైవాన్ సూచీలు మాత్రం 0.03 శాతం, 1.08 శాతం మేర లాభపడ్డాయి. ఐరోపా మార్కెట్లలో ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ సూచీలు 1.12 శాతం నుంచి 1.41 శాతం పెరిగాయి.