బిజినెస్

ఆర్థిక మార్కెట్‌లో సిఎలకు భలే గిరాకీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఆర్థిక మార్కెట్‌లో సిఎలకు మంచి డిమాండ్ ఉందని, ఈ కోర్సును అభ్యసించేందుకు ప్రతిభావంతులు చాలామంది చేరుతున్నారని ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసిఎఐ) కొత్త అధ్యక్షుడు ఎం దేవరాజరెడ్డి అన్నారు. ప్రతిష్ఠాత్మకమైన ఐసిఎఐ అధ్యక్ష పదవికి ఎన్నికైన తొలి తెలుగువాడిగా దేవరాజరెడ్డి నిలిచారు. ఆయన బుధవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ, ఐసిఎఐ 1949 చట్టం నిబంధనల ప్రకారం ఏర్పాటైందన్నారు. ఈ కౌన్సిల్‌లో 40 మంది సభ్యులు ఉంటారని, అందులో 32 మంది ఇతర సభ్యుల చేత ఎన్నుకోబడుతారన్నారు. మిగిలిన ఎనిమిది మందిని కేంద్రం, కాగ్, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ ఎఫైర్స్, ఫైనాన్స్ శాఖలు నియమిస్తాయన్నారు. గత 28 సంవత్సరాలుగా తాను ఐసిఎఐ సభ్యుడిగా సేవలు అందిస్తున్నానని, చార్టెర్డ్ అకౌంటెంట్ రంగంలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పడానికి కృషి చేస్తానని అన్నారు.
టి-20 వరల్డ్ కప్ టోర్నీకి
న్యూమరో యూనో దుస్తులు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: టి-20 వరల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంట్‌కు న్యూమరో యూనో సంస్థ అధికారికంగా దుస్తులను సరఫరా చేయనుంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి)తో ఈ సంస్థ 2020 వరకు అమల్లో ఉండేలా కాంట్రాక్టును కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం ఐసిసి ఆధ్వర్యంలో జరిగే టోర్నీలకు ఈ సంస్థ దుస్తులను స్పాన్సర్ చేస్తుంది.

స్వల్పంగా తగ్గిన పెట్రోల్,
పెరిగిన డీజిల్ ధరలు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల ఒడిదుడుకుల నేపథ్యంలో బుధవారం లీటర్ పెట్రోల్ ధర 32 పైసలు తగ్గితే, డీజిల్ ధర 28 పైసలు పెరిగింది. సవరించిన ధరలు అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయని చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రకటించాయి. చివరిసారిగా ఈ నెల 1న అతిస్వల్పంగా పెట్రోల్ ధర 4 పైసలు, డీజిల్ ధర 3 పైసలు చొప్పున తగ్గాయి. కాగా, తగ్గిన ధరలతో ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 59.63 రూపాయలు, డీజిల్ ధర 44.96 రూపాయలుగా ఉన్నాయి.

కుప్పంలో బ్రిటానియా పరిశ్రమ
ఏర్పాటుకు స్థల పరిశీలన

కుప్పం, ఫిబ్రవరి 17: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ప్రముఖ ఆహారోత్పత్తుల తయారీ దిగ్గజం బ్రిటానియా సంస్థ పరిశ్రమను ఏర్పాటు చేయనుంది. స్థల పరిశీలనకు సంస్థ ప్రతినిధులు బుధవారం కుప్పంలో పర్యటించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా స్థల పరిశీలన జరిపారు. చీమనాయనిపల్లి పంచాయతీ పరిధిలోని సుమారు 70 ఎకరాల ప్రభుత్వ భూములను పరిశీలించారు. ముఖ్యమంత్రి పిఎ మనోహర్, కడ ఎస్‌వో శ్యాంప్రసాద్, తహశీల్దార్ అబ్దుల్‌మునాప్ తదితరులు ఈ బృందం వెంట ఉన్నారు. వీరిని ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో మంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి కలిసి చర్చించారు.