బిజినెస్

త్వరలో ‘మొండి’ బ్యాంక్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకుల ఉనికినే ప్రమాదంలో పడేస్తున్న మొండి బకాయిల (నిరర్థక ఆస్తులు) సమస్యను పరిష్కరించడానికి ఓ ప్రత్యేక బ్యాంక్ లేదా సంస్థను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వద్ద ఉంది. అయితే దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని ఓ సీనియర్ ప్రభుత్వ అధికారి పిటిఐతో అన్నారు. ‘ఈ ప్రతిపాదనన చాలా మంచిది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది తీసిపారేయాల్సిన ఆలోచనేమీ కాదు. ప్రభుత్వరంగ బ్యాంకులు మొండి బకాయిలతో ఏ స్థాయిలో ఇబ్బందులనెదుర్కొంటున్నాయో చూస్తూనే ఉన్నాం. అలాంటి మొండి బకాయిల సమస్య పరిష్కారానికి ప్రత్యేకంగా ఓ వ్యవస్థ అంటూ ఉంటే బాగుంటుంది.’ అని పంజాబ్ నేషనల్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ ఉషా అనంత సుబ్రమణ్యన్ అన్నారు. మరికొందరు బ్యాంకర్లూ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ మాత్రం అలాంటి అవసరమేమీ లేదంటున్నారు. ‘ప్రభుత్వరంగ బ్యాంకుల మొండి బకాయిల సమస్య పరిష్కారానికి ప్రత్యేకంగా ఓ బ్యాంకంటూ అక్కర్లేదు. ఇప్పటికే మొండి బకాయిల భారాన్ని దించుకునేలా బ్యాంకులు చర్యలు చేపట్టాయని నేను అనుకుంటున్నాను. కాబట్టి మరో సంస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు.’ అని ఇటీవల రాజన్ అన్నారు. పలువురు బ్యాంకర్లు రాజన్ అభిప్రాయంతో ఏఖీభవిస్తున్నారు. కాగా, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ గత వారం మొండి బకాయిల వసూలు కోసం బ్యాంకులకు విశేషాధికారాలు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని, త్వరలో ఈ సమస్య పరిష్కారం అవుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. దివాళా చట్టాన్ని కూడా తీసుకొచ్చేలా ముందుకెళ్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. మొండి బకాయిదారులకు రాజకీయ బలం ఉండటం కూడా ఈ సమస్యను జఠిలం చేస్తోందని కొందరు ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోనప్పుడే కొంత పురోగతిని చూస్తామని వారు అభిప్రాయపడుతున్నారు. కాగా, గత ఏడాది మార్చి నాటికి 2.67 లక్షల కోట్ల రూపాయలుగా ఉన్న ప్రభుత్వ బ్యాంకుల నిరర్థక ఆస్తులు.. సెప్టెంబర్ నాటికి 3.01 లక్షల కోట్ల రూపాయలకు చేరాయి. 2015 అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో మొండి బకాయిల కారణంగానే చాలా బ్యాంకులు నష్టాలను చవిచూడగా, ఎస్‌బిఐ తదితర బ్యాంకుల లాభాలు సగానికిపైగా తగ్గాయి. ఈ జనవరి-మార్చి త్రైమాసికంలోనూ లాభాలపై మొండి బకాయిల ప్రభావం ఉంటుందన్న అంచనాను ఎస్‌బిఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య వేశారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.

హెచ్‌పిసిఎల్ సిఎండిగా ఎమ్‌కె సురానా
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్ సంస్థ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పిసిఎల్) నూతన చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సిఎండి)గా ఎమ్‌కె సురానాను కేంద్ర ప్రభుత్వం బుధవారం నియమించింది. పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ సురానా పేరును ప్రతిపాదించగా, దీనికి కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది. 54 ఏళ్ల సురానా.. ప్రస్తుతం ప్రైజ్ పెట్రోలియం కంపెనీ లిమిటెడ్ సిఇఒగా ఉన్నారు. కాగా, వచ్చే నెల మార్చి ఆఖర్లో నిషి వాసుదేవ పదవీ విరమణ పొందుతుండటంతో ఆమె స్థానంలో హెచ్‌పిసిఎల్ సిఎండిగా సురానా బాధ్యతలు చేపట్టనున్నారు.

డాక్టర్ రెడ్డీస్ షేర్ బైబ్యాక్
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: దేశీయ ఔషధరంగ దిగ్గజం డాక్టర్ రెడ్డీస్.. దాదాపు 44.85 లక్షల షేర్లను తిరిగి కొనుగోలు చేయనుంది. ఇందుకు 1,569.4 కోట్ల రూపాయలను వెచ్చించనుంది. బహిరంగ మార్కెట్‌లో ఒక్కో షేర్‌ను 3,500 రూపాయలు మించకుండా మళ్లీ కొనుగోలు చేయాలన్న ప్రతిపాదనను సంస్థ బోర్డు అంగీకరించింది. ఈ మేరకు ఓ ప్రకటనలో బుధవారం డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ స్పష్టం చేసింది. ఈ ప్రక్రియకు మర్చెంట్ బ్యాంకర్‌గా కొటక్ మహీంద్ర క్యాపిటల్ సంస్థను నియమించనట్లు తెలిపింది.