బిజినెస్

రెండోరోజూ లాభాలే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: అంతర్జాతీయ మార్కెట్‌లో పెరిగిన ముడి చమురు ధరలతో నెలకొన్న ఉత్సాహం గురువారం దేశీయ స్టాక్ మార్కెట్లను లాభాల్లో నడిపించింది. ఆసియా, ఐరోపా మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు సైతం భారతీయ సూచీలను వరుసగా రెండోరోజు లాభాలను అందుకునేలా చేశాయి. ఈ క్రమంలోనే బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 267.35 పాయింట్లు పుంజుకుని 23,649.22 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 83.30 పాయింట్లు పెరిగి 7,191.75 వద్ద నిలిచింది.
ఐటి, టెక్నాలజీ, హెల్త్‌కేర్, క్యాపిటల్ గూడ్స్, ఎఫ్‌ఎమ్‌సిజి, చమురు, గ్యాస్, మెటల్, బ్యాంకింగ్ రంగాల షేర్ల విలువ 1.94 శాతం నుంచి 1.10 శాతం వరకు పెరిగింది. ఆసియా మార్కెట్లలో హాంకాంగ్, జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్, తైవాన్ సూచీలు 1.22 శాతం నుంచి 2.32 శాతం మధ్య లాభపడ్డాయి. చైనా సూచీ మాత్రం 0.16 శాతం నష్టపోయింది. ఐరోపా మార్కెట్లలో ఫ్రాన్స్, జర్మనీ సూచీలు 0.24 శాతం, 0.47 శాతం చొప్పున లాభపడగా, బ్రిటన్ సూచీ 0.46 శాతం క్షీణించింది.