బిజినెస్

మున్ముందు రిస్ట్ వాచీలతోనే రోగ నిర్ధారణ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 8: శాస్త్ర విజ్ఞానం సమాజానికి ఉపయోగపడాలని డిఆర్‌డిఒ మాజీ డెరెక్టర్ జనరల్ వికే ఆత్రే అన్నారు. నిన్నమొన్నటి వరకు ఏ చిన్న విషయానికైనా ఆసుపత్రులకు పరుగులు తీసేవారమని, ఇక నుంచి మన ఆరోగ్యం ఎలా ఉందన్నదీ మన రిస్ట్ వాచీలతో తెలుసుకునే సదుపాయం కలగనుందన్నారు. మంగళవారం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ’స్మార్ట్ సెన్సార్స్ అండ్ సిస్టమ్స్’ అనే అంశంపై ఏర్పాటుచేసిన జాతీయ సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ శాస్త్ర సాంకేతిక విజ్ఞానం అభివృద్ధి చెందుతున్నకొద్దీ ఎలక్ట్రానిక్ ఉపకరణాలు చిన్నవిగా రూపొందుతున్నాయన్నారు. రానున్న రోజుల్లో మనిషి బిపి, షుగర్, తదితర వ్యాధులను రిస్ట్‌వాచీల ద్వారానే ఎప్పటికప్పుడు తెలుసుకునేలా ఎలక్ట్రానిక్స్ రంగం ముందుకు పరుగులు పెడుతోందన్నారు. ఎలక్ట్రానిక్ ఉపకరణాల పనితీరులో సెన్సార్ చిప్స్ కీలకమని, ఈ సెన్సార్లతో రకరకాల అద్భుతాలను సాధించగలుగుతున్నారని చెప్పారు. నేడు చంద్ర మండలంలో విశేషాలను కూడా చూడగలుగుతున్నామంటే అది సెన్సార్ల ద్వారానే సాధ్యపడుతుందన్నారు. అయితే శాస్త్ర విజ్ఞానం వల్ల మంచి, చెడు రెండూ ఉంటాయన్న ఆయన దానిని సమాజానికి ఉపయోగపడేలా చూడాలని హితవు పలికారు. ప్రస్తుతం అమెరికా రోబోల తయారీని పెద్ద ఎత్తున చేపట్టిందని, దీనివల్ల ప్రయోజనం ఉన్నప్పటికీ, ఎలాంటి ప్రమాదం ఉంటుందన్నదీ ‘టెర్మినేటర్-2’ సినిమాలో చూపెట్టిన సంగతిని గుర్తుచేశారు. ఇటీవల సెల్‌ఫోన్ల వాడకం విపరీతంగా పెరిగిందని, దీనివల్ల అనర్థాలు ఉన్నప్పటికీ సెల్‌ఫోన్ లేకుండా బతకలేని పరిస్థితికి అలవాటుపడ్డామన్నారు. రానున్న రోజుల్లో చంటి పిల్లాడికీ సెల్‌ఫోన్ ఇవ్వాల్సిన దుస్థితి రావచ్చన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛాన్సలర్ జిఎస్‌ఎన్ రాజు, డిఆర్‌డిఒ మాజీ డైరెక్టర్ జనరల్ వి భుజంగరావు, తదితరులు పాల్గొన్నారు.