బిజినెస్

విదేశీ పెట్టుబడులకు చమురు సెగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దేశీయ స్టాక్ మార్కెట్లలో విదేశీ పెట్టుబడుల ఉపసంహరణలు అంతకంతకూ పెరిగిపోతున్నాయ. కొత్తగా పెట్టుబడులకు దూరంగా ఉండటమేగాక, గతంలో పెట్టిన పెట్టుబడులనూ విదేశీ మదుపరులు తిరిగి తీసేసు కుంటున్నారు. గడచిన మూడు వారాల్లో దాదాపు 4,600 కోట్ల రూపాయల పెట్టుబడులను భారతీయ మార్కెట్ల నుంచి విదేశీ పోర్ట్ఫోలియో మదుపరులు (ఎఫ్‌పిఐ) గుంజేసుకున్నారు. డిపాజిటరీలు అందించిన సమాచారం మేరకు ఈ నెల 1-19 మధ్య దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి ఎఫ్‌పిఐలు 4,503 కోట్ల రూపాయల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. రుణ మార్కెట్ల నుంచి కూడా మరో 96 కోట్ల రూపాయల పెట్టుబడులను పట్టుకుపోయారు. దీంతో అటు స్టాక్, ఇటు రుణ మార్కెట్ల నుంచి ఈ నెలలో ఇప్పటిదాకా 4,599 కోట్ల రూపాయల పెట్టుబడులు తరలిపో యనట్లైంది. గత నెల జనవరిలోనైతే ఎఫ్‌పిఐలు.. స్టాక్ మార్కెట్ల నుంచి 13,381 కోట్ల రూపాయల పెట్టుబడులను లాగేసుకున్నారు. అయితే రుణ మార్కెట్లలోకి మాత్రం 3,274 కోట్ల రూపాయల పెట్టుబడులను తెచ్చారు. దీంతో ఈ ఏడాది ఆరంభం నుంచి చూస్తే భారత స్టాక్ మార్కెట్లలో పెట్టుబడుల కంటే రుణ మార్కెట్లలో పెట్టుబడులకే విదేశీ మదుపరులు కాస్త ఆసక్తి కనబరుస్తున్నట్లు కనిపిస్తోంది. గత ఏడాది కూడా ఇదే పరిస్థితి నెలకొనడం గమనార్హం. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు రికార్డు స్థాయిలో పతనమవడం, ప్రపంచ ఆర్థిక ప్రతికూల పరిస్థితు లు, ముఖ్యంగా చైనా ఆర్థిక వ్యవస్థలో మందగమనం విదేశీ మదు పరులను పెట్టుబడులకు దూ రం చేస్తున్నాయ. బ్లూచిప్ సంస్థల ఆర్థిక ఫలితాలు నిరాశ కలిగించడం, ప్రధానంగా బ్యాంకింగ్ సంస్థల నష్టాలు మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయ. ఇదిలావుంటే ఈ ఫిబ్రవరి నెలలో బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 1,161 పాయిం ట్లు, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ సుమారు 370 పాయింట్లు కోల్పోయాయ.

కోస్ట్‌గార్డ్ ఎయిర్ ఎన్‌క్లేవ్‌కు
కొలిక్కిరాని స్థలం కేటాయింపు

ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, ఫిబ్రవరి 21: కోస్తా తీరం పరిరక్షణ చర్యల్లో భాగంగా ఏర్పాటు చేయనున్న కోస్ట్‌గార్డ్ ఎయిర్ ఎన్‌క్లేవ్‌కు స్థలం కేటాయింపు ఇంకా కొలిక్కి రాలేదు. స్థలం కేటాయించాలని జిల్లా యంత్రాగాన్ని కోస్ట్‌గార్డ్ అధికారులు కోరినా అది ఎంపిక దశలోనే ఉంది. ఇండియన్ కోస్ట్‌గార్డ్ డిస్ట్రిక్ట్-6కు విశాఖ కేంద్రంగా ఉంది. 1988లో ఈ కేంద్రం పూర్తి స్థాయిలో పని చేయడం ప్రారంభించింది. అయతే విశాఖ తీరంలో కీలకమైన ముడి చమురు దిగుమతి కేంద్రాలు, చమురు బావులు, వివిధ రక్షణ రంగ సంస్థలు, కేంద్ర ప్రభుత్వ పరిశ్రమలు ఉండటంతో తీరప్రాంత పరిరక్షణ ప్రాధాన్యతను సంతరించుకుంది. వివిధ గస్తీ నౌకలతో తీర ప్రాంత రక్షణ చర్యలను కోస్ట్‌గార్డ్ చేపడుతుంది. ఇందులో భాగంగా కోస్ట్‌గార్డ్‌కు చెందిన డార్నియర్ విమానాలు ప్రతిరోజూ కోల్‌కతా నుంచి కాకినాడ మీదుగా భువనేశ్వర్ వరకూ సర్వే చేసి తీరంలోని నౌకలు, తదితర వివరాలను కోస్ట్‌గార్డ్ కేంద్రానికి చేరవేస్తాయ. అయితే ఈ ఏరియల్ సర్వే చేసేందుకు విమనాలు రోజూ భువనేశ్వర్ లేదా చెన్నై నుంచి వస్తుంటాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని విశాఖలోనే డార్నియర్ విమానాలను నిలిపి ఉంచేందుకు వీలుగా ఎయిర్ ఎన్‌క్లేవ్ ఏర్పాటుకు ప్రతిపాదించారు. ఐఎన్‌ఎస్ డేగా వద్ద 5 ఎకరాల స్థలం కేటాయంచినప్పటికీ ఆ స్థలాన్నిచ్చేందుకు నేవీ విముఖత వ్యక్తం చేసింది. దీంతో ప్రత్యామ్నాయంగా స్థలం కేటాయింపు ఇప్పటికీ జరగలేదు. ఈ ఎయిర్ ఎన్‌క్లేవ్ ఏర్పాటుతో 3 డార్నియర్ విమానాలు, 10 హెలికాప్టర్లను ఇక్కడ ఉంచే వీలుంటుంది.