బిజినెస్

4జి సేవల్లోకి వొడాఫోన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 8: వొడాఫోన్ ఇండియా దేశీయంగా 4జి సేవలను ప్రారంభించింది. మంగళవారం కొచ్చి నుంచి 4జి సేవల్లోకి వొడాఫోన్ ప్రవేశించగా, ఈ నెల 14 నుంచి కొచ్చిలో 4జి సేవలు వొడాఫోన్ వినియోగదారులకు అందనున్నాయి. అతిత్వరలో త్రివేండ్రం, కాలికట్‌లలోనూ ఈ సేవలను సంస్థ అందుబాటులోకి తేనుంది. అంతేగాక వచ్చే ఏడాది మార్చి నాటికి ముంబయి, ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కతాల్లోనూ 4జి సేవలను విస్తరింపజేయాలని వొడాఫోన్ చూస్తోంది. ఇప్పటికే ఈ ప్రాంతాల్లో వొడాఫోన్ 4జీ సేవల ప్రసారాలను పరీక్షిస్తోంది. కాగా, ఈ ఏడాది ఆగస్టు 6న భారతీ ఎయిర్‌టెల్ 4జి సేవలను ప్రారంభించగా, ఇప్పుడు దేశవ్యాప్తంగా 350కిపైగా నగరాలు, పట్టణాల్లో ఎయిర్‌టెల్ 4జి సేవలు నడుస్తున్నాయి. ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధీనంలోగల రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ కూడా ఈ నెలలోనే 4జి సేవలను మొదలు పెట్టాలని ప్రయత్నిస్తోంది. ఇక ఐడియా సెల్యులార్ వచ్చే ఏడాది ప్రథమార్ధంలో దేశవ్యాప్తంగా ఉన్న 10 సర్కిళ్లలోగల 750 పట్టణాల్లో 4జి సేవలను అందుబాటులోకి తీసుకురావాలనుకుంటోంది. ఇదిలావుంటే కేరళలో సొంత నెట్‌వర్క్‌పై 2జి, 3జి, 4జి సేవలను అందిస్తున్న తొలి టెలికాం సంస్థ వొడాఫోన్ అని ఆ సంస్థ ఈ సందర్భంగా స్పష్టం చేసింది. గడచిన 18 నెలల్లో 3జి, 4జి నెట్‌వర్క్ విస్తరణ కోసం కేరళలో 700 కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టామని ఓ ప్రకటనలో వొడాఫోన్ ఇండియా ఎండి, సిఇఒ సునీల్ సూద్ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా 19 దేశాల్లో 4జి సేవలను అందిస్తున్న అనుభవం వొడాఫోన్‌ది అని ఆయన పేర్కొన్నారు. గత ఏడాది ఫిబ్రవరిలో జరిగిన వేలంలో ముంబయి, ఢిల్లీ, కోల్‌కతా, కేరళ, కర్నాటక సర్కిళ్లలోని అదనపు 4జి (ఎల్‌టిఇ) స్పెక్ట్రమ్‌ను వొడాఫోన్ గెలుచుకుంది. వొడాఫోన్ ఆదాయంలో ఈ ఐదు సర్కిళ్ల వాటా 50 శాతంగా ఉండటం గమనార్హం. ఇకపోతే 3జి ధరలకే 4జి సేవలను వొడాఫోన్ అందిస్తుండగా, 29 రూపాయలకు 120 ఎంబి, 2,499 రూపాయలకు 20జిబి డేటాను ఇస్తోంది. ప్రస్తుతం దేశీయంగా అందుబాటులో ఉన్న అన్ని ప్రముఖ సంస్థల 4జి స్మార్ట్ఫోన్లలో తమ 4జి ఎల్‌టిఇ సేవలను అందుకోవచ్చని వొడాఫోన్ ఈ సందర్భంగా పేర్కొంది.