బిజినెస్

ఎన్‌టిపిసి వాటా విక్రయంతో ప్రభుత్వానికి రూ. 5 వేల కోట్ల నిధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దేశీయ విద్యుదుత్పాదక దిగ్గజం, ప్రభుత్వరంగ సంస్థ ఎన్‌టిపిసి వాటా విక్రయంతో కేంద్ర ప్రభుత్వానికి 5,030 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. ఎన్‌టిపిసిలో 5 శాతానికి సమానమైన 41.22 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఒఎఫ్‌ఎస్) ద్వారా రెండు రోజులపాటు సంస్థాగత మదుపరులకు, రిటైల్ మదుపరులకు ప్రభుత్వం విక్రయించింది. అయితే మంగళవారం సంస్థాగత మదుపరుల నుంచి విశేష స్పందన రాగా, బుధవారం రిటైల్ మదుపరుల నుంచి మాత్రం ఆశించిన స్థాయిలో బిడ్లు దాఖలు కాలేదు. మంగళవారం విదేశీ, దేశీయ సంస్థాగత మదుపరుల నుంచి పెద్ద ఎత్తున బిడ్లు దాఖలయ్యాయి. ఒక్కో షేర్ ధర రూ. 122 ఉండగా, వీటి కోసం దాదాపు 7,287 కోట్ల రూపాయల విలువైన దరఖాస్తులు వచ్చాయి. ఈ ఒఎఫ్‌ఎస్‌లో సంస్థాగత మదుపరులకు మొత్తం 41.22 కోట్ల షేర్లలో 32.98 కోట్లకుపైగా షేర్లను కేటాయించారు. బుధవారం మిగతా షేర్లకు రిటైల్ మదుపరుల నుంచి బిడ్లను స్వీకరించగా, కేటాయంచిన 8.24 కోట్ల షేర్లకుగాను కేవలం 3.63 కోట్ల షేర్లకు సరిపడా బిడ్లు దాఖలైనట్లు దాఖలయ్యాయ. అయనప్పటికీ సంస్థాగత మదుపరుల నుంచి 1.8 రెట్లు అధికంగా బిడ్లు దాఖలవడంతో ఈ వాటా విక్రయానికి సంబంధించి ప్రభుత్వం నిర్దేశించుకున్న ఆదాయం రాగలుగుతోంది. మరోవైపు తాజా అమ్మకంతో ఎన్‌టిపిసిలో కేంద్ర ప్రభుత్వం వాటా 75 నుంచి 70 శాతానికి పడిపోయంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇఐఎల్, ఐఒసి, పిఎఫ్‌సి, ఆర్‌ఇసి, డ్రెడ్జింగ్ కార్పొరేషన్‌లలో ప్రభుత్వం వాటాలను అమ్మేయగా, వీటి ద్వారా ఖజానాకు రూ. 13,300 కోట్ల ఆదాయం సమకూరింది. ఇప్పుడు ఎన్‌టిపిసి వాటా విక్రయంతో మరో 5,030 కోట్ల రూపాయల ఆదాయం రాగా, మొత్తం ఇప్పటిదాకా ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వరంగ సంస్థల వాటాల విక్రయం ద్వారా 18,330 కోట్ల రూపాయలు వచ్చినట్లైంది. నిజానికి ఈ ఆర్థిక సంవత్సరం ప్రభుత్వరంగ సంస్థల వాటాల విక్రయం ద్వారా 69,500 కోట్ల రూపాయల నిధులను అందుకోవాలని మోదీ సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. అయితే దేశ, విదేశీ ప్రతికూల పరిస్థితుల మధ్య స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతుండటంతో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ సజావుగా సాగలేకపోతోంది. మరోవైపు బుధవారం నష్టాలతో ఎన్‌టిపిసి షేర్ విలువ 118.70 రూపాయలకు పడిపోయంది. తాజా ఒఎఫ్‌ఎస్ షేర్ ధర 122.05 రూపాయలుగా ఉన్నది తెలిసిందే.