బిజినెస్

భయాల నీడలో మదుపరులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లలో భారీ పతనం బుధవారం కూడా కొనసాగింది. మంగళవారం 379 పాయింట్లు క్షీణించిన బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్.. బుధవారం 321 పాయింట్లు దిగజారింది. గురువారం రైల్వే బడ్జెట్ పార్లమెంట్‌కు వస్తుండటం, ఫిబ్రవరి నెలకుగాను డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు ముగియనుండటం వంటివి మదుపరులను అమ్మకాల ఒత్తిడికి గురిచేసింది. శుక్రవారం ఆర్థిక సర్వే వెలువడనుండం కూడా మదుపరులను కొనుగోళ్లకు దూరం చేసింది. అంతర్జాతీయంగానూ ఆసియా, ఐరో పా మార్కెట్లు నష్టాల్లో ముగియడం భారతీయ మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. దీంతో సెనె్సక్స్ 321.25 పాయింట్లు పడిపోయి 23,088.93 వద్ద నిలిచింది. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ సైతం 90.85 పాయింట్లు కోల్పోయి 7,018.70 వద్ద స్థిరపడగా, మంగళవారం ఇది 125 పాయింట్లు నష్టపోయినది తెలిసిందే. మెటల్, హెల్త్‌కేర్, క్యాపిటల్ గూడ్స్, బ్యాంకింగ్, పిఎస్‌యు షేర్ల విలువ 2.62 శాతం నుంచి 1.29 శాతం క్షీణించాయి.

‘నైనీ బొగ్గు బ్లాక్ తవ్వకాలకు సహకరిస్తాం’

హైదరాబాద్, ఫిబ్రవరి 24: ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాక్‌లో సింగరేణి సంస్థ చేపట్టనున్న బొగ్గు తవ్వకాలకు పూర్తిగా సహకరిస్తామని ఆ రాష్ట్రంలోని అంగూర్ జిల్లా కలెక్టర్ అనిల్‌కుమార్ సమాల్ హామీ ఇచ్చినట్లు సింగరేణి ప్రాజెక్ట్సు, ప్లానింగ్ డైరక్టర్ ఎ మనోహరరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అంగూర్ జిల్లా రెవెన్యూ అధికారులను మంగళ, బుధవారాల్లో కలిసినట్లు ఆయన వెల్లడించారు. నైనీ బొగ్గు బ్లాకుకు సంబంధించిన భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్ తదితర సమస్యలపై కలెక్టర్‌తో చర్చించామన్నారు.