బిజినెస్

మంత్ర దండంతో వృద్ధిరేటు పెరగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: రాబోయే క్లిష్ట పరిస్థితుల మధ్య దేశ ఆర్థిక వ్యవస్థను వృద్ధిపథంలో నిలబెట్టడానికి ఆర్థిక సంస్కరణల ద్వారా ప్రభుత్వం ముందుకెళ్తోందని ముఖ్య ఆర్థిక సలహాదారు (సిఇఎ)అరవింద్ సుబ్రమణ్యన్ అన్నారు. కఠినమైన సంస్కరణల ద్వారానే అధిక వృద్ధిరేటును అందుకోగలమన్న ఆయన దాన్ని ఏ మంత్ర దండంతోనో సాధించలేమని వ్యాఖ్యానించారు. శనివారం ఇక్కడ పిటిఐకిచ్చిన ఇంటర్వ్యూలో సుబ్రమణ్యన్ మాట్లాడుతూ ‘వచ్చే ఆర్థిక సంవత్సరాని (2016-17)కి భారత జిడిపి వృద్ధిరేటు 7-7.75 శాతంగా ఉండొచ్చని వేసిన అంచనా వాస్తవిక అంశాలను దృష్టిలో పెట్టుకుని వేసినది. అయితే 2008 తరహా మాంద్యం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నెలకొంటే ఈ అంచనా తప్పొచ్చు.’ అని అన్నారు. అయినా దేశ జిడిపి పరుగులు పెట్టాలంటే ఏం చేయాలనేదానిపై శుక్రవారం పార్లమెంట్‌కు తెచ్చిన ఆర్థిక సర్వే 2015-16లో స్పష్టంగా చెప్పామని, ముఖ్యంగా వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) తదితర కీలక సంస్కరణల అమలు తప్పనిసరి అని పేర్కొన్నట్లు గుర్తుచేశారు. అలాగే బ్యాంకింగ్ రంగం, ప్రధానంగా ప్రభుత్వరంగ బ్యాంకింగ్ సంస్థలు ఎదుర్కొంటున్న మొండి బకాయిల సమస్యను పరిష్కరించాల్సిన అవసరాన్ని కూడా పేర్కొన్నారు. దేశీయ పరిశ్రమకు తలెత్తుతున్న సమస్యల నివారణకు దివాళా చట్టాన్ని కూడా తెచ్చే ప్రయత్నంలో ప్రభుత్వం ఉన్నట్లు చెప్పారు.