బిజినెస్

ప్రణాళికా, ప్రణాళికేతర వ్యయాలకు గుడ్‌బై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 8: వ్యయ నిర్వహణ వ్యవస్థను మెరుగుపరచడంలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ‘ప్రణాళికా, ప్రణాళికేతర’ వ్యయాల వర్గీకరణను తొలగించాలని యోచిస్తోంది. ఇప్పటికే ప్రణాళికా సంఘాన్ని తొలగించిన విషయం తెలిసిందే.
దాని స్థానంలో నీతి ఆయోగ్‌ను కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ప్రణాళికా వ్యయం, ప్రణాళికేతర వ్యయానికి బదులుగా ‘క్యాపిటల్, రెవిన్యూ’ వ్యయాలను ప్రవేశపెట్టాలనుకుంటున్నట్లు కేంద్ర ఆర్థిక కార్యదర్శి రతన్ వటల్ మంగళవారం ఇక్కడ తెలిపారు. సంస్కరణల అజెండాపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ.. కేంద్ర, రాష్ట్రాల ఆర్థిక కార్యదర్శులతో సమావేశమైంది. ఈ సందర్భంగా వటల్ మాట్లాడుతూ ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసి నీతి ఆయోగ్‌ను తీసుకొచ్చిన క్రమంలో ఇక ప్రణాళికా వ్యయం, ప్రణాళికేతర వ్యయాలకు అర్థం లేదన్నారు. 2017-18 ఆర్థిక సంవత్సరం నాటికి క్యాపిటల్, రెవిన్యూ వాడుకను అమల్లోకి తెస్తామన్నారు.
మరోవైపు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొస్తున్న ఆర్థిక సంస్కరణలకు రాష్ట్రాలు సహకరించాల్సిన అవసరం ఉందని, దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఇది చాలా ముఖ్యమన్నారు. సమావేశంలో కేం ద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి, ఆర్థిక సేవల కార్యదర్శి, ముఖ్య ఆర్థిక సలహాదారు తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. కేంద్ర, రాష్ట్ర ఆర్థిక కార్యదర్శుల సమావేశం