బిజినెస్

ఆరో రోజూ నష్టాలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 9: పన్ను సంస్కరణలకు సంబంధించిన కీలక బిల్లు వస్తు సేవల పన్ను(జిఎస్‌టి) బిల్లు ఆమోదం మరింత ఆలస్యం కావచ్చన్న భయాల కారణంగా బుధవారం వరసగా ఆరో రోజు కూడా దేశీయ మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. బిఎస్‌ఇ సెనె్సఖ్స 274 పాయింట్లు నష్టపోగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజి సూచీ నిఫ్టీ సైతం 89 పాయింట్లు నష్టపోయి 7,700 పాయింట్ల దిగువకు పడిపోయింది. దీనికి తోడు చమురు ధరలు పడిపోవడంతో పాటుగా అమెరికా స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిసిన నేపథ్యంలో ప్రధాన ఆసియా మార్కెట్ల సూచీలు నష్టాల్లో ముగియడం, ఐరోపా మార్కెట్లు సైతం ప్రారంభంలోనే నష్టాలతో సావడం లాంటి కారణాలు అమ్మకాల జోరుకు కారణమైనాయి. దీంతో బిఎస్‌ఇ సెనె్సక్స్ 274.28 పాయింట్లు పడిపోయి 25,036 పాయింట్ల వద్ద ముగిసింది. సెప్టెంబర్ 7 తర్వాత సెనె్సక్స్ ఇంత దిగువకు పడిపోవడం ఇదే మొదటిసారి. ఆరు రోజుల్లో సెనె్సక్స్ 1133.36 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ సైతం 89.20 పాయింట్లు నష్టపోయి 7,612.50 పాయింట్ల వద్ద ముగిసింది. సెనె్సక్స్‌లోని 30 కంపెనీల షేర్లలో 25 షేర్లు నష్టపోగా, బిహెచ్‌ఇఎల్, టిసిఎస్, ఐటిసిలాంటి అయిదు షేర్లు మాత్రమే లాభాల్లో ముగిసాయి. దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలాంటి సానుకూల సంకేతాలు లేకపోవడంతో పాటుగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచవచ్చనే భయాల కారణంగా విదేశీ సంస్థాగత ఇనె్వస్టర్లు మార్కెట్లనుంచి పెట్టుబడులను ఉపసంహరించుకుంటూ ఉండడం సెంటిమెంట్‌ను దెబ్బ తీస్తోందని బ్రోకర్లు తెలిపారు. మెటల్, హెల్త్‌కేర్, చమురు, గ్యాస్, ఆటో, రియల్టీ రంగాల సూచీలు బాగా నష్టపోయాయి. ప్రధానంగా వేదాంత, టాటా స్టీల్, హిందాల్కో షేర్లు ఐదున్నర శాతానికి పైగా పడిపోవడంతో ఈ రంగానికి చెందిన సూచీ 3 శాతానికి పైగా నష్టపోయింది. బిఎస్‌ఇ స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ సూచీలు కూడా బాగానే నష్టపోయాయి. ఇక అంతర్జాతీయంగా ప్రధాన ఆసియా మార్కెట్లన్నీ నష్టాల్లో ముగియగా, ఐరోపా మార్కెట్లు సైతం నష్టాలతో మొదలైనాయి.

ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ ఖాతాలు
8 నెలల్లో 27 లక్షలు వృద్ధి
న్యూఢిల్లీ, డిసెంబర్ 9: ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఎనిమిది నెలల్లో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో అదనంగా దాదాపు 27 లక్షల మదుపరుల ఖాతాలు వచ్చి చేరాయి. 2014-15 మొత్తం ఆర్థిక సంవత్సరంలో సైతం అదనంగా 25 లక్షల ఖాతాలు ఈ ఫండ్స్‌లో చేరాయి. రిటైల్ ఇనె్వస్టర్లు పెద్దగా పాలు పంచుకోవడమే దీనికి ప్రధాన కారణం. 44 మ్యూచువల్ ఫండ్ సంస్థల ఖాతాలకు సంబంధించి మార్కెట్ రెగ్యులేటర్ సెబి విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఈ ఏడాది మార్చి చివరి నాటికి 3,16, 91, 619 ఉన్న ఈక్విటీ ఫండ్ ఖాతాలు నవంబర్ చివరి నాటికి 3,43, 67,673కు చేరుకున్నాయి. అంటే 26.76 లక్షలు పెరిగాయి. నాలుగేళ్ల తర్వాత మొట్టమొదటిసారిగా గత ఏడాది ఏప్రిల్‌లో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ ఖాతాలు పెరగడం మొదలైంది. అంతకు ముందు 2008లో తలెత్తన అపపంచ ఆర్థిక సంక్షోభం కారణంగా 2009నుంచి కూడా ఈ రంగంలో ఖాతాలు క్లోజ్ చేయడమే ఎక్కువగా ఉండేది. ఈక్విటీల్లోకి పెట్టుబడులు రావడంలో కానీ, కొత్త ఖాతాల విషయంలో కానీ 2014-15 ఆర్థిక సంవత్సరానికి ముందు పూర్తి స్తబ్దత ఉండేది. అయితే గత ఏడాది కాలంగా మార్కెట్లలో ఉత్సాహం నిండుకోవడమే కాక మదుపరులకు మంచి రాబడులు కూడా వచ్చాయి. దీంతో ఈ రంగంపై మదుపరులకు ఆసక్తి కూడా పెరిగింది. కొత్త ఖాతాలు భారీగా పెరగడానికి ఇదే కారణమని ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.

ఎన్‌టిపిసి పనులను త్వరగా పూర్తిచేయాలి
సింగరేణి సిఎండి ఎన్ శ్రీ్ధర్
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, డిసెంబర్ 9: వచ్చే ఏడాది మార్చి నాటికి సింగరేణి విద్యుత్ ప్లాంట్ నిర్మాణం పనులను వేగంగా పూర్తి చేయాలని సింగరేణి సిఎండి ఎన్ శ్రీ్ధర్ ఎన్టీపిసి ప్రధాన నిర్మాణ సంస్ధలైన నేషనల్ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ కార్పోరేషన్, మెకల్నీ భారత్‌కు చెందిన ఉన్నతాధికారులను కోరారు. బుధవారం ఆయన ఇక్కడ ఎన్‌టిపిసి బ్యాలెన్స్ ఆఫ్ ప్లాంట్ పనులపై సమీక్షించారు. 2600 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌కు చెందిన ఇండ్యూస్ట్ డ్రాఫ్ట్ కూలింగ్ టవర్లు, చినీ, సర్క్యులేటడ్ వాటర్ సిస్టమ్‌కు చెందిన నిర్మాణ ప్రగతి పనులను చురుకుగా చేపట్టాలన్నారు. ఈ సమీక్ష సమావేశంలో సింగరేణి సంస్ధ డైరక్టెర్ పి రమేష్ బాబు, ఎగ్జిక్యూటివ్ డైరక్టెర్ ఎస్కె నూర్, ఎన్‌బిసిసి డైరెక్టర్ ఎస్‌కె చౌదరి, ఈడి ఓపి వ్యాస్, మెకల్నీ భారత్ అధ్యక్షులు బికె దాస్ గుప్తా పాల్గొన్నారు.