బిజినెస్

రూ. లక్ష కోట్లు పెరిగిన 7 సంస్థల మార్కెట్ విలువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దేశీయ స్టాక్ మార్కెట్లు గత వారం భారీ లాభాలను అందుకున్న నేపథ్యంలో మదుపరుల సంపద గణనీయంగా పెరిగింది. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్‌లోని టాప్-10 సంస్థల్లో ఏడింటి మార్కెట్ విలువ లక్ష కోట్ల రూపాయలకుపైగా ఎగిసింది. గడచిన నాలుగేళ్లలో ఎన్నడూ లేనంతగా గత వారం సెనె్సక్స్ 1,492.18 పాయింట్లు పుంజుకున్నది తెలిసిందే. దీంతో 7 సంస్థల మార్కెట్ విలువ 1,14,052 కోట్ల రూపాయలు ఎగబాకింది. ఐటి దిగ్గజం టిసిఎస్‌తోపాటు ఐటిసి, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి, ఇన్ఫోసిస్, కోల్ ఇండియా సంస్థల మార్కెట్ విలువ పెరిగితే, సన్ ఫార్మా, హెచ్‌యుఎల్, ఒఎన్‌జిసి మార్కెట్ విలువ తగ్గింది.

ఐకెఇఎ తొలి స్టోర్ హైదరాబాద్‌లోనే
న్యూఢిల్లీ, మార్చి 6: స్వీడన్‌కు చెందిన రిటైల్ ఫర్నీచర్ దిగ్గజం ఐకెఇఎ.. వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో భారత్‌లో తమ తొలి స్టోర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనుంది. ఢిల్లీ-ఎన్‌సిఆర్, ముంబయి, బెంగళూరుల్లోనూ మరిన్ని స్టోర్లను తీసుకురానుంది ఈ సంస్థ. 100 శాతం ఎఫ్‌డిఐ క్రింద రూ. 10,500 కోట్ల పెట్టుబడులతో స్టోర్లను ఏర్పాటు చేసేందుకు 2013లోనే ఐకెఇఎకు కేంద్రం అనుమతిచ్చింది. ఈ క్రమంలో 2025 నాటికి దేశంలోని 9 నగరాల్లో 25 స్టోర్లను తెరవాలనుకుంటున్నట్లు పిటిఐకి సంస్థ తెలిపింది. కాగా, గత ఏడాది జూలైలో హైదరాబాద్‌లోగల హైటెక్ సిటీ వద్ద 13 ఎకరాల స్థలాన్ని సంస్థ కొనుగోలు చేసింది.

కార్ల ధరలను పెంచిన నిస్సాన్
న్యూఢిల్లీ, మార్చి 6: జపాన్‌కు చెందిన ఆటోరంగ సంస్థ నిస్సాన్.. భారత్‌లో కార్ల ధరలను 3.5 శాతం వరకు పెంచింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2016-17)గాను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంట్‌లో గత వారం ప్రవేశపెట్టిన సాధారణ వార్షిక బడ్జెట్‌లో పన్నులను ప్రతిపాదించినది తెలిసిందే. ఈ క్రమంలో నిస్సాన్ కార్ల ధరలు కనిష్టంగా రూ. 4.47 లక్షల నుంచి గరిష్ఠంగా 13.20 లక్షల వరకు పెంచామని సంస్థ పిటిఐకి తెలిపింది. ఇప్పటికే మారుతి, టాటా, హ్యుందాయ్, మహీంద్ర, హోండా సంస్థలు కార్ల ధరలను పెంచాయి.