బిజినెస్

విదేశీ పెట్టుబడులపై ఆధారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: స్థూల ఆర్థిక గణాంకాలు, విదేశీ మదుపరుల పెట్టుబడులు, డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ, అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల కదలికలు, గ్లోబల్ మార్కెట్‌లో ముడి చమురు ధరలు ఈ వారం మార్కెట్ సరళిని నిర్దేశిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. జనవరి నెలకుగాను పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపి) గణాంకాలు శుక్రవారం విడుదలవుతున్నాయి. దీంతో ఈ ప్రభావం మార్కెట్ కదలికలపై ఉంటుందని విశే్లషకులు చెబుతున్నారు. ఇకపోతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) రెపో, రివర్స్ రెపో వడ్డీరేట్లను తగ్గించేందుకున్న అవకాశాలు కూడా సూచీలను ప్రభావితం చేస్తాయని పేర్కొంటున్నారు. ఈ క్రమంలో సూచీలు ఒడిదుడుకులకు లోనుకావచ్చని వారు అంచనా వేస్తున్నారు. ‘దేశీయ స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలు ఈ వారం అంతగా ఏమీ లేవు. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2016-17)గాను గత వారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన సాధారణ వార్షిక బడ్జెట్‌లో ద్రవ్యలోటును 3.5 శాతానికి కట్టడి చేస్తామన్న నేపథ్యంలో కీలక వడ్డీరేట్లను ఆర్‌బిఐ తగ్గించే వీలుందన్న అంచనాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. కాబట్టి మదుపరుల చూపు ఇప్పుడు ఆర్‌బిఐపైనే ఉంది.’ అని ట్రేడ్ స్మార్ట్ ఆన్‌లైన్ వ్యవస్థాక డైరెక్టర్ విజయ్ సింఘానియా అన్నారు. గత వారం ప్రధానంగా ఇదే కారణంతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలను అందుకున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ నాలుగేళ్లలో గరిష్ఠస్థాయి లాభాలను నమోదు చేస్తూ 1,492.18 పాయింట్లు పుంజుకోగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ సైతం 455 పాయింట్లు ఎగిసింది. ‘గత వారం స్టాక్ మార్కెట్ల లాభాలు మదుపరులలో నూతనోత్సాహానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఫిబ్రవరి నెలలో నష్టాలు చవిచూసిన నేపథ్యంలో ఈ మార్పు ఈ వారం కూడా కొనసాగుతుందని అనుకుంటున్నాను. విదేశీ మదుపరుల పెట్టుబడులు కీలకం కానున్నాయి.’ అని మోతీలాల్ ఓస్వాల్ సెక్యూరిటీస్ మిడ్‌క్యాప్స్ రిసెర్చ్ ఎవిపి రవి షెనాయ్ అన్నారు. మరోవైపు బడ్జెట్ ముగిసినందున మదుపరుల దృష్టి ఆయా సంస్థలు ఈ జనవరి-మార్చి త్రైమాసికానికిగాను ప్రకటించే ఆర్థిక ఫలితాలపై ఉంటుందని కూడా పలువురు నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే కీలక బిల్లుల ఆమోదం గురించి బడ్జెట్ సమావేశాలను మదుపరులు దగ్గరగా గమనిస్తారని పేర్కొంటున్నారు. ‘బడ్జెట్ ప్రతిపాదనలు, సంస్కరణల అమలుపై మదుపరుల దృష్టి ఉంటుంది. ఆర్‌బిఐ వడ్డీరేట్ల కోత అంచనాలూ ప్రభావం చూపుతాయి.’ అని కొటక్ సెక్యూరిటీస్ ప్రైవేట్ క్లయింట్ గ్రూప్ రిసెర్చ్ అధిపతి, సీనియర్ ఉపాధ్యక్షుడు దీపెన్ షా అన్నారు.
నేడు మార్కెట్లకు సెలవు
మహా శివరాత్రి సందర్భంగా సోమవారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీలకు సెలవు. తిరిగి మంగళవారం యథాతథంగా స్టాక్ మార్కెట్ల కార్యకలాపాలు కొనసాగుతాయి. ఈ మేరకు ఇరు స్టాక్ మార్కెట్ల వర్గాలు తెలియజేశాయి.
రేపు ఎన్‌ఎస్‌ఇ బాండ్ల వేలం
నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ (ఎన్‌ఎస్‌ఇ) విదేశీ మదుపరులకు మంగళవారం 4,681 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ బాండ్లను వేలం వేయనుంది. సాధారణ ట్రేడింగ్ అనంతరం మధ్యాహ్నం 3:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు 2 గంటలపాటు ఈ వేలం నిర్వహిస్తామని ఓ ప్రకటనలో ఎక్స్‌చేంజ్ వర్గాలు తెలిపాయి.