బిజినెస్

పరిశ్రమల కోసం ‘ల్యాండ్ బ్యాంక్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ: పారిశ్రామికవేత్తలకు భూములు కేటాయించేందుకు వీలుగా తూర్పు గోదావరి జిల్లాలో ల్యాండ్‌బ్యాంక్‌ను ఏర్పాటు చేస్తున్నారు. వివిధ పరిశ్రమలకు అనుకూలంగా ఉన్న భూములను గుర్తించే ప్రక్రియను ప్రభుత్వ యంత్రాంగం యుద్ధప్రాతిపదికన నిర్వహిస్తోంది. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పరిశ్రమలకు అనువైన భూములను గుర్తించి, సమగ్ర నివేదిక సిద్ధంచేసి ప్రభుత్వానికి సమర్పించే పనిలో అధికారులున్నారు. కాగా, ప్రైవేటు, ప్రభుత్వ, అసైన్డ్, నాన్ అసైన్డ్ భూములకు సంబంధించి అన్ని వివరాలను రెవెన్యూ అధికారులు సేకరిస్తుండగా, ప్రైవేటు భూములను సేకరించేందుకే అధికారులు ప్రాధాన్యతనిస్తున్నారు. ముఖ్యంగా జాతీయ రహదారులకు ఆనుకుని ఉన్న భూములు, కాకినాడ తీర ప్రాంతంలో గల భూములను గుర్తిస్తున్నారు. జిల్లాలోని మెట్ట ప్రాంత మండలాల్లో గల భూములనూ ఈ దఫా పెద్ద ఎత్తున సేకరించనున్నట్టు తెలుస్తోంది. ప్రైవేటు భూములను గుర్తించి, భూసేకరణ చట్టాన్ని ప్రయోగించేందుకు కూడా ప్రభుత్వ యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. జిల్లాలోని మెట్ట ప్రాంత మండలాలుగా పేర్కొనే తుని, ప్రత్తిపాడు, శంఖవరం, జగ్గంపేట, రాజానగరం ప్రాంతాల్లో భూములను సేకరించాలని నిర్ణయించారు. కాకినాడ, పెద్దాపురం రెవెన్యూ డివిజన్ల పరిధిలో భూములను సేకరించడానికీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇటీవల విశాఖలో జరిగిన అంతర్జాతీయస్థాయి పారిశ్రామికవేత్తల సదస్సులో విశాఖ కేంద్రంగా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ఆయా సంస్థలు ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. తూర్పు గోదావరి జిల్లాలోనూ సుమారు రూ. 45 వేల కోట్ల పెట్టుబడులతో పరిశ్రమల స్థాపనకు సంస్థలు సంసిద్ధత వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ ల్యాండ్‌బ్యాంక్‌ను సిద్ధం చేయాల్సిందిగా ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.

పెరిగిన జనరల్ మోటార్స్ కార్ల ధరలు
న్యూఢిల్లీ, మార్చి 7: జనరల్ మోటార్స్ ఇండియా సోమవారం కార్ల ధరలను పెంచింది. వివిధ మోడళ్ల ఆధారంగా కనిష్టంగా 3,500 రూపాయల నుంచి గరిష్ఠంగా 51,000 రూపాయల వరకు పెరిగాయి. సోమవారం నుంచే పెరిగిన ధరలు అమల్లోకి వస్తాయని సంస్థ తెలిపింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2016-17)గాను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ గత నెల 29న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన సాధారణ వార్షిక బడ్జెట్ సందర్భంగా ప్రతిపాదించిన కొత్త పన్నులే దీనికి కారణం. ఇప్పటికే ఇదే కారణంతో పలు సంస్థలు కార్ల ధరలను పెంచినది తెలిసిందే.

రూ. 14 వేల కోట్ల ఎఫ్‌డిఐకి ఎఫ్‌ఐపిబి ఆమోదం
న్యూఢిల్లీ, మార్చి 7: విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎఫ్‌ఐపిబి) సోమవారం 14,000 కోట్ల రూపాయల విలువైన 16 విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ) ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదనల్లో రిలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్‌లో జపాన్‌కు చెందిన నిప్పాన్ వాటా 49 శాతానికి పెంచుకునేది కూడా ఉంది. అలాగే యెస్ బ్యాంక్ వాటాను ప్రస్తుతమున్న 41 శాతం నుంచి 74 శాతానికి పెంచుకునేందుకూ ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ నేతృత్వంలోని ఎఫ్‌ఐపిబి అనుమతినిచ్చింది. గత నవంబర్‌లో కొత్త నిబంధనల తర్వాత ఎఫ్‌డిఐని తొలుత పెంచుకుంటున్నది యెస్ బ్యాంకే.