బిజినెస్

మోదీ ప్రభుత్వ హయాంలో 24% పెరిగిన విదేశీ పెట్టుబడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 9: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచి దేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డిఐ) 24 శాతం పెరిగి 60.69 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది. 2013 ఫిబ్రవరి నుంచి 2014 మే నెల వరకు దేశం 48.9 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించిందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. ‘అవును.. బిజెపి నేతృత్వంలోని ప్రస్తుత ఎన్‌డిఎ ప్రభుత్వ హయాంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరిగాయి’ అని ఆమె తెలిపారు. 2014 జూన్ నుంచి 2015 సెప్టెంబర్ మధ్య దేశంలోకి ఆరోగ్యకరమైన రీతిలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించిన రంగాల్లో సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్, వాణిజ్య, సేవా, ఆటోమొబైల్, టెలికమ్యూనికేషన్ రంగాలు ఉన్నాయని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. మన దేశానికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎంతో కీలకమని, ఓడ రేవులు, విమానాశ్రయాలు, రహదారుల వంటి వౌలిక వసతులను మెరుగుపర్చుకుని ఆర్థికాభివృద్ధిని పెంపొందించుకునేందుకు వీలుగా 2017 మార్చి నాటికి ట్రిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించాల్సిన అవసరం ఉందని ఆమె పునరుద్ఘాటించారు.
రైతుల సంక్షేమానికి కట్టుబడే ఉన్నాం..
ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటిఓ)లో దేశ రైతుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు కట్టుబడి ఉన్నామని బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం పునరుద్ఘాటించింది. ‘దేశంలోని రైతుల సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. డబ్ల్యుటిఓలో అన్నదాతల ప్రయోజనాలను పరిరక్షించే విషయమై ప్రస్తుత ఎన్‌డిఎ ప్రభుత్వం స్థిరమైన నిర్ణయం తీసుకుంది’ అని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో స్పష్టం చేశారు.