బిజినెస్

టి20 మ్యాచ్‌లకు ఉచిత వైఫై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ముకేశ్ అంబానీ నేతృత్వంలోని టెలికామ్ రంగ సంస్థ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ (ఆర్‌జెఐఎల్).. రాబోయే ఐసిసి టి20 వరల్డ్ కప్ మ్యాచ్‌ల సందర్భంగా ఆరు క్రికెట్ స్టేడియంలకు ఉచిత వైఫై సేవలను అందించనుంది. ‘ఐసిసి టి20 వరల్డ్ కప్ మ్యాచ్‌లను తిలకించేందుకు వచ్చే ప్రేక్షకుల సౌకర్యార్థం ఆరు స్డేడియంలలో ఉచిత వైఫై సేవలను అపరిమిత స్థాయిలో అందిస్తున్నాం.’ అని ఆర్‌జెఐఎల్ అధికార ప్రతినిధి ఒకరు విలేఖరులకు తెలిపారు. ఇక్కడ ఫిరోజ్ షా కోట్లా స్టేడియం వద్ద ఉచిత వైఫై సేవలను ప్రారంభించారు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్, ముంబయిలోని వాంఖడే స్టేడియం, మోహాలీలోని ఐఎస్ బింద్రా స్టేడియం, ధర్మశాలలోని హెచ్‌పిసిఎ స్టేడియం, బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలలో రిలయన్స్ జియో ఉచిత వైఫై సేవలు అందుబాటులో ఉంటాయి. కాగా, గత ఏడాది ఏప్రిల్‌లో భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన వన్‌డే సిరీస్ సందర్భంగా వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లోనే జియో నెట్‌ను వాడుకలోకి తెచ్చారు. రికార్డు స్థాయిలో వినియోగం కూడా జరిగింది. ‘ముంబయిలో దాదాపు 30,000 మందికి మా నెట్ కనెక్టివిటీ ఉంది. ఏ పాయింట్ వద్దనైనాసరే 20,000 మంది నెట్‌ను నిరంతరం వినియోగించగలుగుతున్నారు. సెకనుకు 15-35 మెగాబైట్ల వేగం ఉంటుంది.’ అని సంస్థ అధికార ప్రతినిధి చెప్పారు. ఇకపోతే ఫిరోజ్ షా కోట్లా స్టేడియం వద్ద ప్రారంభించిన ఉచిత వైఫై సేవలకు సంబంధించి 41,000 మొబైల్స్‌కు కనెక్టివిటీ అందేలా 650 యాక్సెస్ పాయింట్లను రిలయన్స్ జియో ఏర్పాటు చేసింది. అలాగే ఈడెన్ గార్డెన్‌లో 68,000 మొబైల్స్‌కు, వాంఖడే స్టేడియంలో 33,000 మొబైల్స్‌కు, మోహాలి స్టేడియంలో 26,000 మొబైల్స్‌కు, చిన్నస్వామి స్టేడియంలో 35,000 మొబైల్స్‌కు, ధర్మశాల స్టేడియంలో 23,000 మొబైల్స్‌కు వైఫై కనెక్టివిటీని ఉచితంగా అందుకునే సౌకర్యాన్ని రిలయన్స్ జియో తెస్తోంది. గత ఏడాది రిలయన్స్ వ్యవస్థాపకుడు, ముకేశ్ తండ్రి ధీరుభాయ్ అంబానీ జన్మదినం సందర్భంగా సంస్థ ఉద్యోగులకు 4జి సేవలను అందుబాటులోకి తెచ్చిన రిలయన్స్ జియో.. దేశవ్యాప్తంగా త్వరలోనే విస్తరించాలని ప్రయత్నాలు చేస్తోంది. కాగా, ఈ నెల 15 నుంచి వచ్చే నెల 3 వరకు టి20 వరల్డ్ కప్ మ్యాచ్‌లు జరగనున్నాయ. అయతే మంగళవారం నుంచి వారం రోజులపాటు క్వాలిఫై మ్యాచ్‌లు జరగనుండగా, ఈ మెగా టోర్నమెంట్‌లో భారత్‌సహా మొత్తం 16 దేశాలు పాల్గొంటున్నాయ.